టాలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరు అయినా పరశురామ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన యువత సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఆంజనేయులు ,సోలో,  శ్రీరస్తు శుభమస్తు,  గీత గోవిందం సినిమాలకు పరశురామ్ దర్శకత్వం వహించాడు.  పరశురామ్ దర్శకత్వం వహించిన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. గీత గోవింద సినిమాతో పరశురామ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్  క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు.  

ప్రస్తుతం పరశురామ్ 'సర్కారు వారి పాట'  సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చగా సముద్ర కని ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా మే 12 వ తేదిన విడుదల కాబోతుంది.  ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ సినిమా దర్శకుడు పరశురామ్ ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.  

పరశురామ్  మాట్లాడుతూ... మహేష్ బాబు ఇది వరకు చేసిన ఏ సినిమా పాత్ర తోను ఈ సినిమా పాత్రను పోల్చలేము.  ఈ మూవీ లో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా  ఉంటుంది.  అది మాత్రమే కాకుండా ఈ మూవీ లో మహేష్ బాబు యాటిట్యూడ్ కూడా సూపర్ గా ఉంటుంది.  అన్నిటి కంటే ముఖ్యంగా ఈ సినిమాను మహేష్ బాబు ఒకే చేయడానికి ప్రధాన కారణం ఈ మూవీ లో ఆయన పాత్ర యాటిట్యూడ్ అని తాజా ఇంటర్వ్యూలో పరశురామ్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: