సినిమా ప్రపంచంలో కొంతమంది హీరోయిన్లు అనుకున్నంత స్థాయిలో స్టార్ హోదా దక్కించుకోక పోయినప్పటికీ కూడా వారిని ఆడియన్స్ అంత ఈజీగా అయితే మర్చిపోరు. ఇక కొందరు వారి ఘాటైనా అందంతోనే ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటారు.

ఇక ఆ విధంగా మొదటి సినిమాతోనే ఎంతగానో ఆకర్షించిన హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా. మొదట్లో ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అందరూ కూడా అనుకున్నారు. కానీ ఆ తర్వాత పెద్ద సినిమాల్లో అనుకున్నంతగా అవకాశాలు అయితే అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం బ్యూటీ 40 ఏళ్ళ వయస్సులో కూడా బికినీ అందాలతో అందరికి షాక్ ఇస్తోంది. ఇక పూనమ్ రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోల వివరాల్లోకి కనుక వెళితే..

 
పంజాబ్ లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ఆ తర్వాత ముంబై లోకి వెళ్లి అక్కడ ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించింది.. మొదట్లోనే పూనమ్ కు బాలీవుడ్ కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ బ్యూటీ మాత్రం మొదట తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.. నవదీప్ నటించిన 'మొదటి సినిమా' లో మెయిన్ హీరోయిన్ గా నటించి అందరిలో మంచి క్రేజ్ సంపాదించింది.

మొదటి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తప్పకుండా మంచి స్టార్ హీరోయిన్ గా కూడా క్రేజ్ అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే మోడలింగ్ ప్రపంచంలో అందాల ఆరబోతతో ప్రముఖ దర్శక నిర్మాతలను ఆకర్షించింది. అయితే ఈ బ్యూటీ మాత్రం మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచనతో మిస్టేక్ చేసిందట. ఆ తరహాలో ఆలోచించి ఓకే చేసిన కొన్ని పెద్ద సినిమాలు మాత్రం ఊహించని విధంగా భారీగా డిజాస్టర్ అయ్యాయి.


 

వరుస అపజయాలతో ఈ పూనమ్ స్టార్ డం అయితే ఒక్కసారిగా తగ్గి పోయిందట.. ఇక ఆ తరువాత కొన్ని పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసే అవకాశాన్ని కూడా అందుకుంది. అల్లు అర్జున్ బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో వచ్చిన పరుగు సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ సోదరి గా ఆమె నటించిన విధానం అప్పట్లో మంచి గుర్తింపు కూడా అందించింది. కానీ ఆ సినిమా ద్వారా అవకాశాలు మాత్రం ఆమె పెద్దగా అందుకోలేకపోయింది.
 

ఏదేమైనా కూడా పూనమ్ జయాపజయాలతో సంబంధం లేకుండా గత పదిహేనేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే వుంది . ఆ మధ్య ఎన్టీఆర్ బయోపిక్ లో లోకేశ్వరి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలతో అందరినీ కూడా ఆశ్చర్యానికి కలగజేస్తోంది.



పూనమ్ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొన్ని బికినీ ఫోటోలు బాగా వైరల్ గా మారాయి. బ్లాక్ బికినీలో అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది. గతంలో కూడా చాలా రకాల బికినీలో కనిపించిన పూనమ్ ఈ సారి మాత్రం ఊహించని రేంజ్ లో షాకిచ్చింది అనే నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. ఇక పూనమ్ బాజ్వా ప్రస్తుతం తమిళం మలయాళం లో కొన్ని సినిమాలతో బిజీగా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: