ఒక ఇండస్ట్రీ లో విజయవంతమైన సినిమాను మరొక భాషలో రీమేక్ చేయడం అనేది సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో జరుగుతుంది. అలాగే ఇతర భాషల్లో విడుదలై విజయవంతమైన సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం అనేది కూడా ఎప్పటి నుండో జరుగుతున్న విషయమే.  ఇది ఇలా ఉంటే ఎంతో మంది తెలుగు హీరోలు ఇప్పటి వరకు ఒక్క భాషలో విజయవంతమైన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి, అపజయలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రీమేక్ సినిమాలలో నటిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.

చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర సినిమా లో హీరోగా నటిస్తున్నారు.  భోళా శంకర్ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ మూవీ వేదళం కి రీమేక్.  ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటించింది.

 
రాజశేఖర్ : టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరు ఆయన రాజశేఖర్ ప్రస్తుతం శేఖర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ జోసఫ్ కు రిమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు జీవిత-రాజశేఖర్ దర్శకత్వం వహించింది.

 
పవన్ కళ్యాణ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో తమిళ్ హిట్ మూవీ వినోదయ సీతం ను తెలుగులో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: