ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకు ఎంట్రి ఇచ్చి చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ ఇక ఇప్పుడు హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు అడవి శేషు. ఎప్పుడు అడవి శేషు విషయం లో తెలుగు ప్రేక్షకులందరూ నమ్మేది ఒకటే.. అడవి శేష్ ఏదైనా కథ ఒప్పుకొని సినిమా చేస్తున్నాడు అంటే చాలు ఆ సినిమాలో ఏదో తెలియని మ్యాజిక్ ఉండబోతుందని.. కథ బలంగా ఉంటుందని నమ్మకం పెట్టుకున్నారు. ఇలా తన సినిమాల తో ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడూ.


 గతంలో ఎన్నో సినిమాల లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనలోని నటుడిని ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకున్న అడవిశేషు గూడచారి అనే సినిమా తో సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే ఒక పాత్రలో ఒదిగి పోయిన నటించిన తీరు అందరినీ మెప్పించింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మేజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు అడవి శేషు.  సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే.  జూన్ 2వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. శశికిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మహేష్ బాబు నిర్మిస్తున్నారు.


 సినిమాల్లో భారత సైనికుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటిస్తున్నాడు అడవి శేషు. ఇక హీరోయిన్గా నటిస్తుంది సాయి మంజ్రేకర్. కాగా ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భం గా తన లైఫ్ లో ఎదురైన ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చాడు.  నవదీప్, శివ బాలాజీ హీరోలుగా నటించిన చందమామ సినిమాలో మొదట హీరోగా తనని అనుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. నవదీప్ పాత్ర నేనే చేయాల్సింది. అయితే అంత కుదిరాక రెండు రోజులు సినిమా షూటింగ్ చేశాక ఏం జరిగిందో నన్ను సినిమా నుంచి తప్పించారు అంటూ చెప్పుకొచ్చాడు అడవి శేషు.

మరింత సమాచారం తెలుసుకోండి: