భార్య భర్తలు అన్న తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇటీవలి కాలంలో అయితే భార్యలూ వంటింటికే పరిమితం కాకుండా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. భర్తలు కూడా మేమే గొప్ప అనుకోకుండా  ఇంట్లో పనులు కూడా షేర్ చేసుకుంటున్నారు. ఒకప్పడితో పోల్చి చూస్తే ఇక ఇప్పుడు భార్య భర్తల బంధం మరింత బలపడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సాధారణంగా భర్తలు ఎప్పుడు చెప్పే మాట నా భార్య ఏం మాట్లాడినా ఎంతో స్వీట్ గా ఉంటుంది అని. కానీ భార్య ఒక్క మాట అంటే చాలు అటు భర్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతు ఉంటాయి.


 వాళ్లు వీళ్లు అనే తేడా లేదు ప్రతి ఒక్క భర్త కూడా ఆ మాట అనగానే వణికి పోవాల్సిందే. అంతలా భర్తలను భయపెట్టే మాట ఏంటి అని అనుకుంటున్నారా.. షాపింగ్ వెళ్దాం రండి అంటూ భార్య ప్రేమగా పిలవడం. భార్య మాట అనగానే అమ్మో షాపింగా అంటూ భర్తలు భయపడి పోతూ ఉంటారు. ఇక ఏదో ఒక పని ఉంది అని చెప్పి బయటికి వెళ్ళి పోతూ ఉంటారు. ఇలాంటివి సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. అయితే భార్యను ఇలా షాపింగ్ కి వెళ్దాం రండి అంటూ ప్రేమగా పిలిచినా సమయంలో వారి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని ఇటీవల జబర్దస్త్ లో చూపించారు.


 ఇటీవల జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిం
ది. ఇక ఈ ప్రోమో లో భాగంగా రాకెట్ రాఘవ స్కిట్ అందరికీ బాగా కనెక్ట్ అయిపోతుంది. రాకెట్ రాఘవ స్కిట్ లో భాగంగా అతని భార్య షాపింగ్ వెళ్దాం అని చెబుతోంది. అయితే నేను ఈరోజు ఆఫీస్ మానేస్తాను.. ఇక ఈ యాభై వేలు ఖర్చు అయినా పర్వాలేదు షాపింగ్ చేయాల్సిందేనంటూ చెబుతాడు రాఘవ..ఇంకా కొంత దూరం బైకు మీద వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి అతనితో గొడవ పెట్టుకుంటాడు. దీంతో ఇక షాపింగ్ వద్దు ఏం వద్దు ఇంటికి వెళ్దాం రండి అంటూ రాకెట్ రాఘవ భార్య చెబుతుంది. కట్ చేస్తే అలా గొడవ పెట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు రాకెట్ రాఘవ స్నేహితుడే. షాపింగ్ అనే కాన్సెప్ట్ ను చెడగొడతారు. ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. ఇక అది చూసిన తర్వాత వామ్మో భార్యలు షాపింగ్ అనగానే ఇలా కూడా తప్పించుకోవచ్చా అని అనుకుంటున్నారు భర్తలు..

మరింత సమాచారం తెలుసుకోండి: