ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ కు ఎదురు గాలి వీస్తోంది. ఈ మధ్యనే చిరంజీవి మరియు రామ్ చరణ్ లు కలిసి నటించిన మూవీ ఆచార్య గత నెలలో విడుదలై డిజాస్టర్ గా నిలవడమే ఇందుకు కారణం. ఎన్నో అంచనాలతో బరిలోకి వచ్చిన మెగా మూవీ మొదటి షో నుండి ప్లాప్ టాక్ ను మూటగట్టుకుని చిరంజీవి సినిమా చరిత్రలో అపఖ్యాతి తెచ్చుకుంది. ఈ సినిమాతో వరుస సక్సెస్ సినిమాలు తీసిన దర్శకుడు కొరటాల శివ కూడా విమర్శల పాలయ్యాడు. అందుకోసం ఇప్పుడు చిరంజీవి దృష్టి అంతా తన నెక్స్ట్ ప్రాజెక్టుల మీద పడింది. ఇప్పుడు అన్ని సినిమాలు కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఆచార్య దెబ్బ తినడంతో మళ్ళీ అలాంటి దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమా విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేతిశున్నారని అప్పుడే సినిమా పరిశ్రమలో టాక్ వస్తోంది. ఇప్పుడు తీస్తున్న సినిమాలలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో డైరెక్ట్ గా చిరంజీవి వేలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లూసిఫర్ రీమేక్ చిత్రీకరణా చివరికి దశలో ఉంది. కాబట్టి ఇందులో మార్పులు చేసే ప్రయోగం చేయరని తెలుస్తోంది. ఇక వేదాళం రీమేక్ గా వస్తున్న భోళా శంకర్ పైనే ఇతని దృష్టి ఉంది.

అందుకే ఇందులో మార్పులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. కానీ ఆచార్య సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణం మెగా హీరోల జోక్యం అని వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ చిరంజీవి ఇందులో మార్పులు చేస్తే ఎక్కడా తేడా కొడుతుందో అని ఫ్యాన్స్ అంతా కంగారులో ఉన్నారట. మెహర్ రమేష్ ఎఫర్ట్ పెట్టి కంటెంట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫలితం ఉండే అవకాశం ఉంది. మరి ఏమి జరగనుందో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: