స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కిన పుష్ప 1 మూవీ ఎంత పెద్ద సక్సెస్ కొట్టిందో అందరికీ తెలిసిందే. పుష్ప ది రైజ్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా పుష్ప పాత్రలో మాస్ స్టైల్ లో ఎంతో అద్భుతంగా నటించి అందరి మనసులు గెలుచుకున్నారు అల్లు అర్జున్.

మాస్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ గా సాగె ఎంటర్టైనర్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఆ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. దానితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా పుష్ప 2 (ది రూల్) పై విపరీతంగా అంచనాలు ఏర్పడ్డాయి. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ పార్ట్ 1 ని మించేలా మరింత అద్భుతంగా సాగనుందట. ముఖ్యంగా కథ, కథలను మరింత బలంగా ఆడియన్స్ మనసుని ఆకట్టుకునేలా దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ సిద్ధం చేసారని టాక్.

అలానే దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి పార్ట్ 1 ని మించేలా మరింత అద్భుతంగా సాంగ్స్, బీజీఎమ్ అందించనున్నారని, మరీ ముఖ్యంగా దీనికి బడ్జెట్ ఎంతో భారీ స్థాయిలో కేటాయించనున్నారని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందనున్న పుష్ప 2 మూవీ స్క్రిప్ట్, టేకింగ్ విషయమై యూనిట్ ఎక్కడా కూడా కంప్రమైజ్ కాకూడదని నిర్ణయించారట. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే త్వరలో పట్టాలెక్కనున్న ఈ మూవీ, ఆపైన తెరకెక్కి థియేటర్స్ లోకి రిలీజ్ అయి పెద్ద సెన్సేషన్ సృష్టించే అవకాశం గట్టిగ కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ సినిమా ఎంత మేర విజయం అందుకుంటుందో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: