తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల ద్వారా.. సీరియల్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అచ్యుత్ కూడా ఒకరు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఈయన నటనపై ఆసక్తి పెంచుకొని మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ నేర్చుకున్నాడు. టైపింగ్ తో మొదటి సారి ఇంద్రధనస్సు అనే ఒక సీరియల్ లో నటించడానికి సిద్ధమయ్యాడు. దూరదర్శన్లో ప్రసారమైన ఈ సీరియల్ తో అచ్యుత్ కి మంచి కెరీర్ మొదలైందని చెప్పవచ్చు. ఇక ప్రేమ ఎంత మధురం అనే సినిమా ద్వారా నటుడిగా మంచి పేరు ను సొంతం చేసుకున్నారు.

ఇక ఆ తర్వాత అల్లరిరాముడు , ఎదురులేని మనిషి,  తమ్ముడు,  వాసు , డాడీ వంటి ఎన్నో సినిమాలలో నటించిన ఈయన మంచి పేరు తెచ్చుకుని.. ఆ తర్వాత అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 2012లో గుండెపోటుతో మరణించాడు అని ప్రతి ఒక్కరు చెప్పడం గమనార్హం. కానీ ఆయన మరణం వెనుక రహస్యం వేరే ఉంది అని మరికొంతమంది చెబుతూ ఉండేవారు. ఈ క్రమంలోని ఎఫ్2 సినిమా ద్వారా గుర్తింపు  తెచ్చుకున్న ప్రదీప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అచ్యుత్ మరణానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించారు. ఇంటర్వ్యూలో భాగంగానే ప్రదీప్ మాట్లాడుతూ అచ్యుత్ మరణానికి ఎటువంటి రీజన్ లేదు అని ఆయన స్పష్టం చేశారు.

ఇక ఎక్కువగా డ్రింకింగ్ చేసే చనిపోయారు అన్న కారణం ప్రస్తుతం ప్రచారంలో ఉన్నప్పటికీ అందులో నిజం లేదు అని.. నాన్ వెజ్ , స్మోకింగ్ లాంటివి ఎప్పుడో మానేసాడు అని స్వీట్లు ఎక్కువగా తినడంతో పాటు కూడా కూల్ డ్రింక్ లు ఎక్కువగా తాగేవాడు అని తెలిపాడు.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ అవడం వల్లే అది గుండెపై ప్రభావం పడిందని అందుకే అచ్యుత్ మరణించాడు అని ప్రదీప్ వెల్లడించాడు. ఇక ఏది ఏమైనా ఈ మరణం సినీ ఇండస్ట్రీలో తీరని లోటు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: