‘సర్కారు వారి పాట’ విడుదలై 10 రోజులు దాటిపోయినప్పటికీ ఈసినిమాకు పోటీ ఇవ్వగల మరొక భారీ సినిమా విడుదల లేకపోవడంతో ఈమూవీ కలక్షన్స్ మరీ భయంకరంగా డ్రాప్ కాకుండా బయ్యర్లకు కొంతవరకు ధైర్యాన్ని కలిగించాయి. ఈమూవీని ప్రమోట్ చేస్తూ అటు మహేష్ ఇటు కీర్తి సురేష్ లు ఇంకా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు.కీర్తి సురేష్ కు వచ్చిన ‘కళావతి’ ఇమేజ్ తో కొన్ని శారీ షోరూమ్స్ తమ కొత్త బ్రాంచ్ ల ఓపెనింగ్ కు కీర్తి సురేష్ ను అతిధిగా పిలుస్తున్నారు అంటే ఆమె రేంజ్ ఈమూవీతో బాగా పెరిగింది అని అర్థం అవుతుంది. ఈ పరిస్థితుల మధ్య ఆమె లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమూవీ షూటింగ్ లో తాను మహేష్ ను తిట్టడానికి పడిన పాట్లను బయటపెట్టింది.మహేష్ మొహం మీద చేయి చూపెడుతూ కీర్తి సురేష్ ‘బోకు’ అన్న తిట్టు తిట్టవలసి వచ్చినప్పుడు కీర్తి సురేష్ ఆ డైలాగ్ ను చెప్పే విషయంలో మొహమాట పడటంతో అప్పటికే మూడుసార్లు టేక్స్ చేసారట. దర్శకుడు పరుశురామ్ ఆశించిన స్థాయిలో కీర్తి డైలాగ్ లో కనిపించక పోవడంతో మహేష్ కలగచేసుకుని ఆమె దగ్గరకు వెళ్ళి ‘నీకు దణ్ణం పెడతాను తొందరగా తిట్టు మండిపోతున్న ఎండలో నిలబడలేక పోతున్నాను’ అంటూ ఆమె వద్దకు వెళ్ళి రిక్వెస్ట్ చేసాడట.


అదే షూటింగ్ స్పాట్ లో మహేష్ పక్కన ఉన్న అతడి కూతురు సితార కలిపించుకుని ఇంత చిన్న తిట్టు తిట్టడం కష్టం ఏమిటి అంటూ కీర్తి సురేష్ వద్దకు వెళ్ళి చెప్పడంతో అప్పటి వరకు మొహమాటపడిన కీర్తి తన మొహమాటాన్ని పక్కకుపెట్టి ఒక రేంజ్ లో ఆషాట్ లో నటించి వెంటనే పరుశురామ్ తో ఒకే అనిపించుకుందట. ఇప్పటివరకు కీర్తి నోటివెంట రాని డైలాగ్స్ అవ్వడంతో జాతీయ స్థాయి ఉత్తమ నాటికీ కూడ బూతుల విషయంలో కష్టాలు పడింది అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: