తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోగా ఎన్నో ఏళ్ల పాటు హవా నడిపించిన రాజశేఖర్ కొన్నాళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇలా హీరోగా వరుసగా విజయాలు సొంతం చేసుకుంటూ ఉన్నాడు రాజశేఖర్. ఈ క్రమంలోనే హీరో రాజశేఖర్ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం శేఖర్.. ఇక ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.


 ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా చిత్రబృందం మాత్రం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల హీరో రాజశేఖర్ ఈటీవీ లో ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్  కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్  ప్రోమో కాస్త వైరల్ గా మారిపోయింది. స్కిట్ లో భాగంగా స్టేజ్ మీద కంటెస్టెంట్ లు గొడవ పడుతూ ఉంటే మీరు ఏదైనా చేయాలి సార్ అని న్యాయనిర్ణేత ఇంకా ఉన్న ఇంద్రజ రాజశేఖర్ ను కోరుతుంది.. నిజంగానే ఏదో ఒకటి చేయండి సార్ లేకపోతే ఇక్కడ కొట్టుకుని చచ్చిపోయే లాగ ఉన్నారు అంటూ కంటెస్టెంట్ లు అంటారు. వెంటనే రాజశేఖర్ అందుకని మీరు కొట్టుకుని చనిపోయేముందు శేఖర్ సినిమా చూడండి అంటూ పంచు వేస్తాడు.


 దీంతో అక్కడున్న వారందరూ కూడా తెగ నవ్వుకుంటారు అని చెప్పాలి.. ఇక ఈ ప్రోమోలో చూసుకుంటే సత్యభామ సత్యభామ అనే పాటకు ఇంద్రజ తో కలిసి స్టెప్పులు వేసి అలరించాడు హీరో రాజశేఖర్. యాంకర్ రష్మీ తో కలిసి కూడా కాళ్ళు కదిపాడు అని చెప్పాలి. ఏదేమైనా ప్రోమో చూసిన తర్వాత మాత్రం ఈ ఏడాది కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: