ఇప్పటివరకు 2022 వ సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ లుగా నిలిచాయి. కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చి, అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లు బాక్సాఫీస్ దగ్గర రాబట్టినప్పటికీ వాటిని జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ల కారణంగా ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అపజయం పాలయ్యాయి.  అలాగే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకొని ఆ సినిమాలకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ల కంటే ఎక్కువ మొత్తాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసి క్లీన్ హిట్ లుగా నిలిచాయి. అలా 2022 వ సంవత్సరంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్స్ గా నిలిచిన సినిమాల గురించి తెలుసుకుందాం.

బంగార్రాజు : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు సాధించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే కూడా ఎక్కువ కలెక్షన్లను సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర  క్లీన్ హిట్ గా నిలిచింది.


డీజే టిల్లు : సిద్ధు జొన్నలగడ్డ హీరోగా స్నేహ శెట్టి హీరోయిన్ గా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే టిల్లు సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే కూడా అధిక మొత్తాన్ని బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది.


ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే కూడా ఎక్కువ మొత్తాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసి క్లీన్ హిట్ గా నిలిచింది.


కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే కూడా ఎక్కువ మొత్తంలో కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి క్లీన్ హిట్ ను సాధించింది.


కాలేజ్ డాన్ : శివ కార్తికేయన్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సీబీ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన కాలేజ్ డాన్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే కూడా ఎక్కువ మొత్తాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసి క్లీన్ హిట్ ని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. ఇలా ఈ ఐదు సినిమాలు 2022 వ సంవత్సరంలో ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ లుగా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: