అజయ్‌ దేవగణ్‌ డైరెక్టర్‌ కమ్ హీరోగా చేసిన సినిమా 'రన్‌వే 34'. ఈ మూవీ విడుదలకు ముందు అజయ్‌ దేవగణ్‌, సుదీప్‌తో సోషల్ మీడియాలో వార్‌ చేసి సినిమాకి కావల్సినంత ప్రమోషన్ చేశాడు. అయితే అజయ్‌ ఎంత ట్రై చేసినా 'రన్‌వే 34'కి ఫస్ట్‌ డేనే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. సినిమాకి సరైన ఓపెనింగ్స్‌ కూడా రాలేదు. షాహిద్‌ కపూర్‌ 'అర్జున్‌ రెడ్డి'ని 'కభీర్‌ సింగ్‌'గా రీమేక్‌ చేసి సూపర్‌ హిట్‌ కొట్టాడు. ఇక ఈ సక్సెస్‌ ఇచ్చిన జోష్‌తో 'జెర్సీ' సినిమాని రీమేక్ చేశాడు. ఏప్రిల్‌ 22న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది. ఒరిజినల్‌ ఫిల్మ్ తీసిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలోనే ఈ రీమేక్‌ తెరకెక్కినా, ఆడియన్స్‌ కనెక్ట్‌ కాలేదు.

అక్షయ్‌ కుమార్‌కి బాక్సాఫీస్‌ దగ్గర మినిమం గ్యారెంటీ అనే ఇమేజ్‌ ఉంది. అయితే ఈ ఏడాది వచ్చిన 'బచ్చన్‌పాండే' ఈ ఇమేజ్‌ని చెడగొట్టింది. తమిళనాట హిట్ అయిన సినిమాని కూడా కరెక్ట్‌గా రీమేక్‌ చేయలేకపోయాడనే విమర్శలు తీసుకొచ్చింది. 'జిగర్తాండ' రీమేక్‌గా వచ్చిన 'బచ్చన్‌ పాండే' డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చింది. కరోనా ఫస్ట్‌వేవ్‌ తర్వాత సౌత్‌ ఇండస్ట్రీస్‌ కొంతవరకు కోలుకున్నాయి. సెకండ్‌, థర్డ్‌ వేవ్స్‌ సమయంలోనూ ఎంతోకొంత వసూళ్లు తెచ్చుకున్నాయి. కానీ థర్డ్‌ వేవ్‌ కంప్లీట్‌ అయ్యే వరకు బాలీవుడ్‌ లాక్‌డౌన్‌లోనే ఉండిపోయింది. దీంతో హిందీ ఇండస్ట్రీ ఈ ఏడాదిపై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పటివరకు సరైన హిట్‌ మాత్రం ఇవ్వలేకపోయారు బాలీవుడ్ స్టార్లు.

టైగర్‌ష్రాఫ్‌ యాక్షన్‌ హీరోగా నిలదొక్కుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇండియన్‌ బ్రూస్‌లీ, ఇండియన్‌ జాకీచాన్‌ అనిపించుకోవాలని రిస్కీ స్టంట్స్‌ కూడా చేస్తున్నాడు. అయితే హై వోల్టేజ్‌ యాక్షన్‌ మూవీగా వచ్చిన 'హీరోపంతి2' మాత్రం బాక్సాఫీస్‌ దగ్గర మినిమం కాంపిటీషన్‌ కూడా ఇవ్వలేకపోయింది. జాన్‌ అబ్రహం సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర ఎంత సైలెంట్‌గా వచ్చి వెళ్లిపోతుంటాయో, ఈ హీరో కూడా అంతే సైలెంట్‌గా ఉంటాడనే పేరుంది. అయితే 'ఎటాక్-1'ని ప్రమోట్‌ చేయడానికి సౌత్ ఇండస్ట్రీస్‌పైనా, తెలుగు సినిమాలపైనా కామెంట్‌ చేశాడు. కానీ ఈ కాంట్రవర్శీస్‌ కూడా 'ఎటాక్-1'ని కాపాడలేకపోయాయి.

ఆయుష్‌మాన్ ఖురానా కెరీర్‌లో మెమరబుల్‌ హిట్‌గా నిలిచింది 'బదాయి హో'. ఈసినిమాకి రాజ్‌కుమార్ రావు సీక్వెల్‌ చేశాడు. 'బదాయి దో' పేరుతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోయింది. ఇక డైరెక్ట్‌ ఓటీటీలో రిలీజైన అభిషేక్‌ బచ్చన్ 'దస్వీ', దీపిక పదుకొణే 'గెహరాయియా' సినిమాలు కూడా నెగటివ్‌ రివ్యూస్‌ తెచ్చుకున్నాయి. మరి ఫస్ట్‌ క్వార్టర్‌లో వరుస ఫ్లాపులు చూసిన బాలీవుడ్‌ మున్ముందు ఎలాంటి ఫలితాలు అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: