నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలకు పోటాపోటీగా వరుస చిత్రాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ ను డీ కొడుతున్న హీరో. తాజాగా అఖండ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన సొంతం చేసుకున్నారు ఈ సీనియర్ హీరో. వరుసగా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ లో మూడు సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నారు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్ లతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీనియర్ వయసుకు ఆయన జోష్ కు అస్సలు మ్యాచ్ కాదు. ఆరుపదుల వయసు దాటుతున్నా ఈ సీనియర్ హీరో ఇప్పటికీ అంతే హుషారుగా, యంగ్ గా కనిపిస్తూ వరుస చిత్రాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఈయన దూకుడు మరింత మరింత పెరిగింది. ఈయన లుక్ లో చాలా మార్పు వచ్చింది.

అదే విధంగా తన గ్లామర్ తో పాటు వరుస ప్రాజెక్టు లకు చేస్తూ స్పీడ్ మరింత పెంచారు. అయితే దీనికంతటికీ కారణం ఆయన చిన్న కుమార్తె తేజస్వని అని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో తండ్రికి సంబందించిన అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటుంది తేజు. ఆయన మేకప్, కాస్ట్యూమ్స్ ఇలా అన్ని అంశాల లోనూ ప్రత్యేక శ్రద్ద చూపిస్తోందట. అంతేకాదు దర్శకుల విషయం లోను తన తండ్రికి సలహాలు ఇస్తుందట.  గతంలో చాలా మంది ప్లాప్ డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చి పొరపాటు చేసిన బాలయ్య ఈ మధ్య ఆచి తూచి మరి దర్శకులను ఎంచుకుంటున్నారు. ఈ విషయంలో తేజు జోక్యం వుందని అంటున్నారు.

వయసులో చిన్నదే అయినా ఈమె చాలా ఇంటలిజెంట్ . ఏ విషయాన్ని అయినా ఇట్టే పట్టేస్తారట. గత సంవత్సరం అన్ స్టాపబుల్ షో పేరుతో బాలకృష్ణ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ షో కి క్రియేటివ్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు తేజశ్వని. అలా ఈ విజయం వెనుక కూడా ఆమె హస్తం ఉందట.  
తండ్రిని సరికొత్త లుక్ లో కనిపించేలా చేయడానికి చాలా కష్టపడుతున్నారట తేజు. స్క్రిప్ట్ విషయంలో కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపెడుతూ తండ్రినే డైరెక్ట్ చేసేంత స్థాయికి చేరుకుందట ఈ నందమూరి వారసురాలు.  ఇక బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి సక్సెస్ఫుల్ దర్శకులతో వర్క్ చేయనున్న విషయం విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: