కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్. ఈ సినిమా తర్వాత పంజాబీ భామకు మంచి ఆఫర్స్ వచ్చాయి.


వాటిలో చాలా సినిమాలు హిట్స్ కావడంతో మెహ్రీన్ క్రేజ్ కూడా పీక్స్‌లోకి చేరింది. కాని రాను రాను కెరీర్ పరంగా ఒడి దొడుకులు ఎదుర్కొంటూ వస్తుందట. అందంతో పాటు అభినయం విషయంలో పాస్ అవుతూ కెరీర్ ను ఆమె నెట్టుకు వస్తుంది.


2019లో వచ్చిన ఎఫ్ 2 చిత్రంతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న మెహ్రీన్ ఇప్పుడు ఎఫ్ 3తో పలకరించేందుకు సిద్ధమైందట.ఎఫ్ 3 తో ఖచ్చితంగా మంచి సక్సెస్ ను ఈ అమ్మడు అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తప్పకుండా ముందు ముందు మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన ఎఫ్ 3 సినిమా తర్వాత ఈ అమ్మడు విజయ్ హీరోగా నటించబోతున్న సినిమా లో మెహ్రీన్ నటిస్తున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి.


మెహ్రీన్ కు తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమాలో ఆఫర్ వచ్చిందే వార్తలు రావడంతో అమ్మడి దశ తిరిగి పోయిందంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. విజయ్.. వంశీ పైడిపల్లి కాంబోలో రూపొందుతున్న సినిమాలో రష్మిక మందన్నా ఒక హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ గా మెహ్రీన్ అంటూ వచ్చిన వార్తలు అన్నీ కూడా కేవలం పుకార్లే అని తేలిపోయిందట.. స్వయంగా యూనిట్ సభ్యులే ఆ విషయాన్ని తేల్చారు.


విజయ్ 66 సినిమా లో రష్మిక మాత్రమే హీరోయిన్ అని.. మరే హీరోయిన్ ను ఈ సినిమాలో ఎంపిక చేయడం లేదంటూ దిల్ రాజు టీమ్ కూడా క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజు నిర్మించిన ఎఫ్ 3 సినిమా లో మెహ్రీన్ నటించడం వల్ల ఆయనే నిర్మిస్తున్న విజయ్ 66 లో కూడా మెహ్రీన్ కు అవకాశం ఇచ్చి ఉంటారు అనే పుకార్లకు ఆయన చెక్ పెట్టారు. పుకార్లు నిజం అయ్యి విజయ్ 66 లో ఛాన్స్ వచ్చి ఉంటే తెలుగు మరియు తమిళంలో బిజీ అయ్యేది పాపం ఈ పాప.


 


నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత మెహ్రీన్ గ్లామర్ షోతో తెగ రచ్చ లేపుతుంది. కేక పెట్టించే అందాలతో అందరి మతులు పోగొడుతుంది. మెహ్రీన్ షేర్ చేసే ఫొటోలు కూడా సెగలు రేపుతున్నాయి. ఎఫ్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా మెహ్రీన్ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: