లోకనాయకుడు కమల్ హాసన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ తాజాగా విక్రమ్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ పై  ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నాయి. కమల్ హసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలే పెట్టుకున్నారు. 

విక్రమ్ సినిమా తెలుగు హక్కులను శ్రేష్ట మూవీస్ దక్కించుకుంది. ఇది తెలుగు హీరో నితిన్ సొంత బ్యానర్.  విక్రమ్ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం సభ్యులు పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో,  సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ విక్రమ్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమాకు అనిరుధ్ అందించిన పాటలలో నుంచి కొన్ని పాటలను చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా విక్రమ్ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. విక్రమ్  మూవీ కి సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇది ఇలా ఉంటే కమల్ హాసన్ విశ్వరూపం తర్వాత విక్రమ్ మూవీ తో వెండి తెరపై ప్రేక్షకులను అలరించబోతున్నారు. మరి విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి , ఫాహాద్ ఫాసిల్ ముఖ్య పాత్రల్లో నటించగా సూర్య గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నడు.

మరింత సమాచారం తెలుసుకోండి: