విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రకాష్ రాజు ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమా లలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రకాష్ రాజ్ కేవలం తెలుగు భాషా మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా తమిళ , హిందీ , మలయాళ , కన్నడ భాష మూవీ లలో కూడా నటించి అన్ని ప్రాంతాల్లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు .

ఇలా ఇండియా వైడ్ గా  నటుడి గా  తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పర చుకున్న ప్రకాష్ రాజ్ తాజాగా అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో సాయి మంజ్రేకర్ ,  శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన  మేజర్ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. మేజర్ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది . ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను చిత్ర బృందం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రీమియర్ షో లకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది . ఇది ఇలా ఉంటే తాజాగా ప్రకాష్ రాజ్ 'మేజర్' సినిమా గురించి తన సోషల్ మీడియా ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు.

 ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా... మేజర్ మూవీ హృదయాన్ని హత్తుకునే మూవీ . ఈ మూవీ  కచ్చితంగా అందరినీ కదిలిస్తుంది . ఇలాంటి గొప్ప మూవీ లో నేను కూడా ఒక భాగం అయ్యినందుకు చాలా గర్వపడుతున్నానని ,  ఈ మూవీ ని ఎవరూ  మిస్ అవ్వద్దని ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు .

మరింత సమాచారం తెలుసుకోండి: