మెగా కుటుంబలో అకిరా నందన్ హైట్ ఎవరికీ రాలేదు. 6అడుగులు దాటిన అతడి పొడుగు చూసి చిరంజీవి మురిసిపోతూ అకిరా తనను మించిపోయాడు అంటూ తన సన్నిహితుల దగ్గర ఆనందపడుతూ ఉంటాడట. మెగా కుటుంబంలోని హీరోలు అంతా అకిరా నందన్ ను అభిమానిస్తారు. అయితే అకిరా మాత్రం అడవి శేషును అభిమానించడం చాలామందిని ఆశ్చర్య పరుస్తుంది.



‘మేజర్’ మూవీని ప్రమోట్ చేస్తూ అడవి శేషు కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. తనకు అకిరా నందన్ కు మధ్య చాల ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ తామిద్దరం మంచి స్నేహితులుగా ఉంటామని కామెంట్ చేసాడు. అంతేకాదు కనీసం వారానికి ఒకసారి తామిద్దరం బయట కలుస్తూ ఉంటామని అలా కలిసినప్పుడు తమ ఇద్దరి మధ్య ఎన్నో ఆసక్తికర విషయాలు చర్చలకు వస్తాయన్న సీక్రెట్ బయట పెట్టాడు.



అంతేకాదు అకిరా చాల మృదువుగా ఉంటాడని ఎక్కడా తాను ఒక టాప్ హీరో కొడుకుని అన్న ఇగో అతడి మాటలలో కనిపించదు అని అంటున్నాడు. వాస్తవానికి భవిష్యత్ లో అకిరా సినిమా హీరో అవుతాడా లేదా అన్నది తనకు కూడ క్లారిటీ లేదని అయితే మ్యూజిక్ పట్ల అకిరా కు విపరీతమైన అభిరుచి ఉంది అంటున్నాడు. అదేవిధంగా అకిరా తరుచు కంపోజ్ చేసే పియానో మ్యూజిక్ బిట్స్ తనకు పంపుతూ ఉంటాడని వాటిని వింటూ తాను రాత్రుళ్ళు నిద్రపోతానని మరొక సీక్రెట్ బయట పెట్టాడు,



ఇక అకిరా నందన్ తో కలిసి తాను మల్టీ స్టారర్ చేసే విషయమై స్పందిస్తూ అకిరా నిజంగా ఇండస్ట్రీలోకి వస్తే తాను ఖచ్చితంగా అకిరా పక్కన నటిస్తాను అంటూ కనీసం తన పాత్ర ఏమిటో కూడ తాను అడగను అని అంటున్నాడు. అయితే అకిరా తో తనకు ఇంత పరిచయం ఉన్నప్పటికీ తాను పవన్ తో ఎక్కువగా మాట్లాడను అని అంటూ కేవలం తన సాన్నిహిత్యం అకిరా తో మాత్రమే పరిమితం అంటున్నాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: