కియారా అద్వానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఈమె బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది .ఇదిలావుండగా  ఇక తెలుగులో భరత్ అనే నేను , వినయ విధేయ రామ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.కాగా  ఈ అమ్మడు ప్రస్తుతం రామ్ చరణ్ తో శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మళ్లీ అవకాశాన్ని సొంతం చేసుకుంది.అయితే  బాలీవుడ్ లో కూడా ఈమె తాజాగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే ప్రస్తుతం కియారా అద్వాని బాలీవుడ్ లో ఆనీష్ బజ్మీ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం భూల్ భూలయ్య 2.. 

ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా  ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆనందంలో మునిగి తేలుతోంది కియారా అద్వానీ. అయితే  ఈ సినిమాకి ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె తనకు అతి వింత వ్యాధి గురించి మీడియాతో చెప్పుకొని ఎమోషనల్ అయ్యింది.అంతేకాదు ఈ క్రమంలోనే కియారా అద్వానీ ప్రముఖ ఫేమస్ షో కపిల్ శర్మ షో లో పాల్గొని సందడి చేసింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే తనకు ఉన్న వింత వ్యాధి గురించి వెల్లడించింది కియారా అద్వానీ.అయితే ఈ షోలో భాగంగా కపిల్ శర్మ కియారా అద్వానీ గురించి అడగగా ఆమెకి బర్డ్ ఫోబియా ఉంది అని స్పష్టం చేసింది. అంతేకాదు తనకు పెద్ద పెద్ద పక్షులు అంటే భయం అని..

ఇక వాటిని చూసినప్పుడు తన లో టెన్షన్ మొదలవడంతో పాటు కన్నీరు కూడా వస్తుంది అని.. అంతేకాదు ఇలా ఎందుకు వస్తుందో తెలియదు అంటూ ఆమె కొంచెం వరకు ఎమోషనల్ అయ్యింది.ఇదిలావుంటే  ఇప్పటికీ ఆ సమస్యకు చికిత్స లేకపోవడం చాలా బాధాకరం అంటూ కియారా వెల్లడించింది.ఇక ప్రస్తుతం కీయారా అద్వానీ తెలుగులో రామ్ చరణ్ ,శంకర్ సినిమాతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై మాత్రం ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: