అడవి శేష్ హీరోగా తెరకెక్కిన మేజర్ మూవీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర సాధిస్తోంది. జూన్ 3 వ తేదీన థియేటర్లలో విడుదలైన మేజర్ సినిమాకు విడుదల అయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మరి మేజర్ సినిమా ఇప్పటి వరకు 6 రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.

6 రోజులకు గాను మేజర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.39 కోట్ల షేర్ , 24.10 కోట్ల గ్రాఫ్ కలెక్షన్ లను బాక్సాఫీసు దగ్గర వసూలు చేసింది .
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  1.55 కోట్లు .
హిందీ మరియు ఇతర భాషలలో 3.20 కోట్లు .
ఓవర్ సీస్ లో : 5.32 కోట్లు .


6 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా మేజర్ మూవీ 24.46 కోట్ల షేర్ , 44.75 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
మేజర్ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా దాదాపు గా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , 19 కోట్ల బ్రేక్ ఈవెన్ ఫార్ముల తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్  బరిలో దిగింది. 6 రోజులకు గాను మేజర్ సినిమా 24.46 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి,  5.46 కోట్ల లాభా లను ఇప్పటికీ అందుకొని క్లీన్ హిట్ గా నిలిచింది. మేజర్ మూవీ లో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ కీలక పాత్రలలో నటించగా , ఈ మూవీ కి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: