కాగా తమిళంలో విజయం సాధించిన వినోదయ సిత్తం ని తెలుగులో పవన్ మరియు సాయి ధరమ్ తేజ్ లతో చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు దీనిపై అధికారికంగా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం సముద్ర ఖని వహిస్తున్నట్లు సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆయన క్లారిటీ ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు భవదీయుడు భగత్ సింగ్ చిత్రం పక్కనపెట్టి వినోదయ సిత్తం సినిమా చేయడానికి పవన్ సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇక అలాగే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానుందని అసలు ఇంకా చెప్పాలి అంటే రద్దైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని కథనాలు వెలువడుతున్నాయి.
అయితే ఇటీవల అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్, హరీష్ శంకర్ లు ఇద్దరు కూడా భవదీయుడు భగత్ సింగ్ ప్రస్తావన తెచ్చారు. అంతే కాకుండా ఈ మూవీ చేస్తున్నట్లు స్పష్టత కూడా ఇచ్చారు. దీంతో ప్రేక్షకులలో కొత్త కన్ఫ్యూషన్ మొదలైంది. దీనితో అసలు వినోదయ సిత్తం రీమేక్ ఉందా లేదా ? అసలు ఉంటే.. భవదీయుడు కి ముందా వెనుకా ? అనే అనుమానాలు ప్రేక్షకులలో మొదలయ్యాయి. మరి ఈ క్రమంలో పవన్ లైన్ అప్ పై గందరగోళం ఏర్పడింది. అయితే ఇప్పుడు హరి హర వీరమల్లు షూటింగ్ 50 శాతానికి పైగా పూర్తి అయినట్లు సమాచారం. కాగా ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి