టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోలలో ఒకరైన గోపీచంద్ ప్రస్తుతం పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా, ఈ మూవీ లో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను చిత్ర బృందం విడుదల చేయగా ఈ రెండు పాటలకు  ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. 

అలాగే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది ఇలా ఉంటే పక్కా కమర్షియల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అవుతున్నా మధ్యలో కరోనా వల్ల కొన్ని రోజుల పాటు షూటింగ్ ఆగిపోవడం, ఆ తర్వాత దర్శకుడు మారుతిసినిమా షూటింగ్ ని నిలిపి వేసి సంతోష్ శోభన్ హీరోగా మెహరీన్ హీరోయిన్ గా మంచి రోజులు వచ్చాయి సినిమాను తెరకెక్కించడంతో మరి కొన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇలా అనేక కారణాల వల్ల చాలా రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. విజయవంతంగా షూటింగ్ పూర్తి కావడంతో పక్కా కమర్షియల్ చిత్ర బృందం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ను జూన్ 12 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను జులై 1 వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సిటీ మార్ సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న గోపీచంద్ తో పక్కా కమర్షియల్ మూవీ తో ఎలాంటి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: