టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపును సంపాదించుకున్న పూజా హెగ్డే, రష్మికల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక  ఈ ఏడాది వరుస షాకులు తగిలాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు హీరోయిన్లు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.ఇదిలావుంటే ఈ ఇద్దరు హీరోయిన్లకు శ్రీలీల రూపంలో షాక్ తగులుతోందని సమాచారం అందుతోంది.ఈమె  క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రీలీల ఆచితూచి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారు.

అయితే రోషన్ పెళ్లిసందడి సక్సెస్ తో స్టార్ హీరోల సినిమాలలో కూడా శ్రీలీలకు ఆఫర్లు వస్తున్నాయి. కాగా శ్రీలీల ఎక్స్ ప్రెషన్లు అద్భుతంగా పలికిస్తుందని డ్యాన్సులు బాగా చేస్తుందని పేరు రావడంతో ఆమెకు ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇకపోతే బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల ఎంపికయ్యారని ఇప్పటికే వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయనే సంగతి తెలిసిందే.అయితే ఈమె ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన శ్రీలీల భవిష్యత్తులో పాన్ ఇండియా హీరోయిన్ గా చక్రం తిప్పడం ఖాయమని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

శ్రీలీల నిజంగానే ఆ స్థాయికి చేరుకుంటారో లేదో చూడాల్సి ఉంది.కాగా  శ్రీలీల ప్రస్తుతం ఒక సినిమాకు కోటి రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.ఇకపోతే శ్రీలీల తర్వాత సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే ఆమె క్రేజ్ మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు. అంతేకాదు యూత్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శ్రీలీల భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతానని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే శ్రీలీల క్రేజ్ ను చూసి ఇతర హీరోయిన్లు సైతం షాకవుతున్నారు.ఇకపోతే  శ్రీలీల కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇక  శ్రీలీలకు యంగ్ హీరోలకు జోడీగా ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: