జబర్దస్త్ లో బాగా పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్ ఎవరు అంటే ముందుగా వినిపించే పేరు సుడిగాలి, సుదీర్ గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్. ఈ ముగ్గురు  జబర్దస్త్ త్రీ మంకీస్ గా బుల్లితెర ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకర్షించారు. ఇక ఒకే టీంలో కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఎన్నో సంవత్సరాలు ఎంటర్టైన్మెంట్ పంచారు. ఇక కొన్నాళ్లపాటు జబర్దస్త్ ప్రేక్షకులు కేవలం సుడిగాలి సుదీర్ స్కిట్స్ చూడటానికి మాత్రమే జబర్దస్త్ చూసే వారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఈ ముగ్గురిలో ప్రస్తుతం గెటప్ శీను,   సుడిగాలి సుదీర్ జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లి పోగా.. రాంప్రసాద్ మాత్రమే ఈ షోలో కొనసాగుతూ ఉన్నాడు. జబర్దస్త్ ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఇద్దరు కమేడియన్స్ ఎందుకు తప్పుకున్నారు అన్న విషయంపై మాత్రం ఇప్పటికే చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇక వీరిద్దరూ వెళ్లిపోయిన తర్వాత తాను ఒంటరి వాడిని అయిపోయా అనే ఫీలింగ్ వస్తుంది అంటూ రాంప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముగ్గురు స్నేహితులు ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.


 జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ఈ ముగ్గురు కమెడియన్స్ బయట  ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ ఉంటారు. అయితే ఈవెంట్ మేనేజర్లతో ఎన్నో సందర్భాల్లో గొడవలు జరిగాయని కానీ వాటిని చూసి చూడనట్టు వదిలేసే వాళ్లము అంటూ తెలిపారు. మాకు ఎంతో మంది ఈవెంట్ మేనేజర్లు సైతం  ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా లక్షల రూపాయల ఎగ్గొట్టారని గెటప్ శీను ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ పెళ్లి ప్రస్తావన రావడంతో ఈ విషయంపై సుధీర్ మాట్లాడుతూ దేనికైనా సమయం రావాలి సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంటూ సమాధానం చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: