మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిరుచులు చాల డిఫరెంట్ గా ఉంటాయి. అతడి ఫామ్ హౌస్ లో పెంచుతున్న అనేక పెట్ యానిమల్స్ పై పెట్టే ఖర్చు ప్రతినెలకు లక్షల రూపాయలలో ఉంటుంది. అదేవిధంగా చరణ్ అవకాశం చిక్కితే చాలు తన భార్య ఉపాసన తో కలిసి విదేశాలకు వెళుతూ అక్కడ చాల విలాసవంతమైన జీవితం గడపడం చరణ్ కు ఉన్న అలవాటు.ఈపరిస్థితులలో రామ్ చరణ్ ఈమధ్య వేసుకున్న లెదర్ జాకెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చరణ్ వేసుకున్న లెదర్ జాకెట్ విలువ 2600డాలర్లు అని తెలుస్తోంది. మన ఇండియన్ కరెన్సీలో దీనివిలువ పరిగణలోకి తీసుకుంటే సుమారు 2లక్షల వరకు ఉంటుంది అని అంటున్నారు. ఈడిజైనర్ లెదర్ జాకెట్ లో కనిపించిన చరణ్ వేసుకున్న బూట్ల ఖరీదు 40వేల రూపాయలు అని తెలుస్తోంది.సాధారణంగా మెగా ఫ్యామిలీలో పుట్టిన చిరంజీవి రామ్ చరణ్ లు తప్పితే మిగతా మెగా హీరోలు పెద్దగా అత్యంత ఖరీదైన బట్టలు వేసుకోరు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే అటు షూటింగ్ సమయంలో కాని ఇటు తన ఇంటిలో కూడ చాల సింపుల్ గా కనిపిస్తాడు. అయితే దీనికి పూర్తిగా విరుద్ధం రామ్ చరణ్. జూనియర్ ఎన్టీఆర్ మహేష్ ల వార్డ్ రోబ్ నిండా అత్యంత ఖరీదైన విలాసవంతమైన వాచ్ లు అదేవిధంగా బ్రాస్ లెట్స్ ఉంటాయి అని అంటున్నారు.


మహేష్ జూనియర్ లు చేతికి పెట్టుకునే వాచ్ ల ఖరీదు లక్షలలో ఉంటుంది. ఇక మన టాప్ హీరోయిన్స్ విషయానికి వస్తే సమంత పూజా హెగ్డే లు వాడే హ్యాండ్ బ్యాగ్స్ 2లక్షల ధరకు పై మాటే అంటారు. అయితే నేచురల్ స్టార్ నాని మటుకు పవన్ కళ్యాణ్ లానే చేతికి ఖరీదైన వాచ్ లు అదేవిధంగా ఖరీదైన లెదర్ జాకెట్స్ వేసుకోకుండా చాల సింపుల్ గా సినిమా ఫంక్షన్స్ కు వస్తూ ఉంటారు..
మరింత సమాచారం తెలుసుకోండి: