రాజకీయాలలో సినిమాలలో శాశ్విత శతృవులు మిత్రులు కలకాలం ఉండరు అన్న విషయాన్ని ప్రకాష్ రాజ్ మంచు విష్ణులు మరొకసారి ఋజువు చేసారు. ఆమధ్య దేశ స్థాయిలో జరిగే ఎన్నికల రణరంగాన్ని తలపిస్తూ జరిగిన ‘మా’ సంస్థ ఎన్నికలలో ప్రకాష్ రాజ్ మంచు విష్ణులు ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ తీవ్ర ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే.ఆ ఎన్నికలలో మంచు విష్ణు ఎన్నిక చెల్లదు అంటూ ప్రకాష్ రాజ్ మీడియాకు ఎక్కడమే కాకుండా ఏకంగా కోర్టులో కూడ దావాలు వేయాలని ప్రయత్నాలు చేసారు. అలాంటి మంచు విష్ణు ప్రకాష్ రాజ్ లు నిన్న ఒకరికొకరు ఎదురుపడి తమ మధ్య ఏమి జరగలేదు అన్నట్లుగా చేయిచేయి కలిపి ప్రాణ స్నేహితులుగా మాట్లాడుకుంటూ కెమెరాలకు పోజు ఇచ్చిన సందర్భాన్ని చూసి చాలామంది ఆశ్చర్య పడినట్లు తెలుస్తోంది.


ఈ సంఘటన యాక్షన్ హీరో అర్జున్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ విశ్వక్ సేన్ ను హీరోగా పెట్టి తీస్తున్న సినిమా ప్రారంభోత్సవ ఫంక్షన్ లో జరిగింది. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వచ్చిన ఆ ఫంక్షన్ కు ప్రకాష్ రాజ్ మంచు విష్ణులు కూడ అతిధులుగా వచ్చారు. ప్రకాష్ రాజ్ ను చూడగానే మంచు విష్ణు నవ్వుతూ వెళ్ళి అతడిని పలకరించడమే కాకుండా చేయిచేయి కలిపాడు. మధ్యలో విశ్వక్ సేన్ వేసిన జోక్స్ కు ఇద్దరూ కూడ ముసిముసి నవ్వులు చిందించారని తెలుస్తోంది. దీనితో ఈ ఫంక్షన్ ను రికార్డు చేయడానికి వెళ్ళిన మీడియా వర్గాలు మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ల సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోలను వరసపెట్టి తీయడంతో అవి వైరల్ గా మారాయి.


మంచు విష్ణు అధ్యక్షుడుగా ఎన్నిక అయ్యాక ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ విష్ణు అధ్యక్షుడుగా మా సంస్థకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అన్నది నిరంతరం ప్రశ్నిస్తాను అని చెప్పాడు. అయితే ఆ విషయాలు అన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు వీరిద్దరూ మంచి మితృలుగా మారిపోవడంతో త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదు..మరింత సమాచారం తెలుసుకోండి: