2023 వ సంవత్సరం సంక్రాంతి కి విడుదల కాబోయే సినిమాల లిస్ట్ ఈ సారి కాస్త పెద్దగానే ఉండే విధంగా కనిపిస్తోంది. ఇప్పటికే వరుస పెట్టి స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒక దాని తర్వాత ఒక దానిని సంక్రాంతి కి విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందాలు ప్రకటిస్తూ వస్తున్నాయి .

తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న చిరంజీవి 154 వ సినిమాను కూడా 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు కూడా సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందాలు ప్రకటించాయి. అందులో ముందుగా ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరు ఆయన తలపతి విజయ్ హీరోగా టాలీవుడ్ క్రేజీ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా వరిసు (వారసుడు) మూవీ ని  కూడా 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

అలాగే పంజా వైష్ణవ్ తేజ్ కెరియర్ లో 4 వ మూవీగా తెరకెక్కుతున్న  సినిమాను కూడా 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న ఈ 4 సినిమాలను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందాలు అధికారికంగా ప్రకటించాయి. మరి ఈ లిస్ట్ లో ఇంకా ఎన్ని సినిమాలు జాయిన్ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: