టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడుగా బాలకృష్ణకు ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బాలకృష్ణ కి తాజాగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి కోవిడ్ పరీక్షల్లో బాలకృష్ణకు పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా సమాచారం. ఇక ఈయన కుటుంబ సభ్యులు సైతం హోమ్ ఐసోలేషన్ ఉన్నారు. తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని కానీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా కూడా గత రెండు రోజులుగా తనను కలిసిన వారు కూడా ఈ పరీక్ష చేయించుకోవాలని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమాలో నటించాల్సి ఉంది . బయట కార్యక్రమాలలో బాలయ్య విరివిరిగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణకు కరోనా సోకినట్లు గా  తెలుస్తోంది. టాలీవుడ్ లో ఇప్పటికి కరోనా సోకిన వారు చాలామంది  ఉన్నారు. పలువురు సినీ తారలు కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే.. తాజాగా బాలకృష్ణ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం బాగా కలకలం రేపుతోంది.

అయితే అభిమానులకు సైతం స్వల్ప లక్షణాలు ఉండడంతో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలియజేయడం జరిగింది .బాలయ్యకు పాజిటివ్ అని తెలిసిన వెంటనే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సైతం బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పలు పోస్ట్ పెడుతూ ఉన్నారు. ఇక బసవతారకం  హాస్పిటల్ గురించి ఈ రోజున ఒక విషయం బాగా వైరల్ గా మారుతోంది. ఇండియాలోని ఎంతో గొప్ప పేరు పొందిన క్యాన్సర్ హాస్పిటల్లో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు సైతం ఎంతో ఆనంద పడ్డారు కానీ బాలకృష్ణకు కరోనా పాజిటివ్ అని తెలియగానే కాస్త నిరుత్సాహ చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: