ఎప్పటినుంచో తన రేంజ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కమలాసన్ మొత్తానికి ఇటీవల విక్రమ్ సినిమాతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్ కొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.అయితే ఇక అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని మరో తమిళ హీరో కూడా ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.ఇక అతను మరెవరో కాదు. విభిన్నమైన తరహాలో నటన కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టే హీరో విక్రమ్. చియాన్ విక్రమ్ ఒకప్పుడు తెలుగులో కూడా శివపుత్రుడు అపరిచితుడు వంటి సినిమాలతో చాలా మంచి గుర్తింపు అందుకున్నాడు.అయితే అతనికి ఎంత కష్టపడుతున్న కూడా బాక్సాఫీస్ వద్ద గత పదేళ్లుగా అసలు సరైన సక్సెస్ అయితే అందడం లేదు. శంకర్ దర్శకత్వంలో చివరగా చేసినారు ఐ మనోహరుడు చిత్రం కమర్షియల్ గా బాగానే అడిగినప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఈ సినిమా సక్సెస్ లేకపోయింది. ఇక ప్రస్తుతం అతను కూడా తన ఆశలన్నీ కూడా తన కోబ్రా సినిమా పైనే పెట్టుకున్నాడు.జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన కోబ్రా సినిమాలో విక్రమ్ ఏకంగా పదకొండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా చాలా కొత్తగా ఉంటాయట.


అయితే సినిమాను డైరెక్టుగా ఓటీటీ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఆ మధ్యలో కొన్ని కథనాలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇక కోబ్రా సినిమాపై అనుకున్నంతగా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి లేకపోవడం వల్లనే ఓటీటీ ఆఫర్ కు నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సోషల్ మీడియాలో కూడా కొన్ని కథనాలు అభిమానులను కన్ఫ్యూజన్ కు గురి చేశాయి.అయితే ఇటీవల నిర్మాణ సంస్థ నుంచి సినిమా విడుదల డేట్ పై అఫీషియల్ గా ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. సినిమా డైరెక్ట్ గా థియేటర్లోనే విడుదల చేయబోతున్నట్లు చెబుతూ ఆగస్టు 11వ తేదీన తెలుగు ఇంకా తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు ప్రత్యేకమైన పోస్టర్ల ద్వారా తెలియజేశారు. ఇక ఈ సినిమాలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరి కోబ్రా సినిమా ద్వారా చియాన్ విక్రమ్ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: