టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు అయిన కిరణ్ అబ్బవరం తాజాగా సమ్మతమే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించగా, చాందిని చౌదరిమూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో సమ్మతమే సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు .

నిన్న అనగా జూన్ 24 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన సమ్మతమే సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ లభించింది. నిన్న అనగా జూన్ 24 వ తేదీన సమ్మతమే మూవీ తో పాటు దాదాపుగా అరడజను పైగా సినిమాలు విడుదల అవడంతో ఈ సినిమాకు కాస్త తక్కువ కలెక్షన్లే నమోదు అయ్యాయి. మొదటి రోజు సమ్మతమే మూవీ  రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50 లక్షల ప్లస్ షేర్ కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. నిన్న విడుదల అయిన అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ మూవీ కే కాస్త ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సమ్మతమే సినిమాకు మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండటంతో,  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 4.50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది .

దానితో ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే బాక్సాఫీస్ దగ్గర 5 కోట్ల కలెక్షన్ లను రాబట్ట వలసి ఉంది. మొదటి రోజు 50 లక్షలకు మించి షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సమ్మతమే సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర  వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: