టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరైన నాగ చైతన్య తాజాగా థాంక్యూ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రాశి కన్నా హీరోయిన్ గా నటించగా,  విక్రమ్ కే కుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. కొంత కాలం క్రితం థాంక్యూ మూవీ ని జూలై 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది .

అందులో భాగంగా ఈ సినిమా టీజర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాను జూలై 8 వ తేదీన విడుదల చేయడం లేదు అని, జులై 22 వ తేదీన విడుదల చేయబోతున్నాము అంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే జూలై 22 వ తేదీన నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2  మూవీ ని విడుదల చేయబోతున్నట్లు చాలా రోజుల క్రితమే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇన్ని రోజుల వరకు ఈ సినిమాకు కేవలం బాలీవుడ్ మూవీ షాంషేర్ మూవీ తో తప్ప వేరే ఎ మూవీ తో పోటీ లేదు.

తాజాగా నాగ చైతన్య నటించిన థాంక్యూ మూవీ ని కూడా జులై 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృంద ప్రకటించడంతో కార్తికేయ 2 సినిమాకు బాక్సాఫీస్ దగ్గర గట్టి సవాలే ఎదురు అయ్యేలా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కార్తికేయ సినిమా మంచి విజయం సాధించడంతో కార్తికేయ 2 సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే కార్తికేయ2  మూవీ లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: