సమంత నాగ చైతన్యలు విడిపోయిన తరువాత వారిద్దరూ ఎవరి సినిమా షూటింగ్ లలో వారు బిజీగా ఉంటున్నారు. వీరిద్దరూ విడిపోవడంతో మళ్ళీ వీరు ఎవర్ని పెళ్ళి చేసుకుంటారు అన్న ఆశక్తి చాలామందిలో ఉంది. ఇలాంటి సందర్భంలో ఈమధ్య నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ తో సన్నిహితంగా ఉంటున్నాడు అంటూ మీడియాలో వస్తున్న వార్తలను విని చాలామంది షాక్ అవుతున్నారు.


దీనికితోడు ఈమధ్య ముంబాయిలో జరిగిన శోభిత పుట్టినరోజు వేడుకలకు చైతన్య ప్రత్యేకంగా ముంబాయి వెళ్ళి ఆమెను కలిసాడు అంటూ సోషల్ మీడియాలో గాసిప్పులు తీవ్రస్థాయిలో వచ్చాయి. అయితే ఈ గాసిప్పులను చైతన్య సన్నిహితులను కానీ లేదంటే చైతన్య పిఆర్ టీమ్ కాని ఖండిస్తూ ప్రకటన ఇవ్వక పోవడంతో ఈవార్తలలో ఏమైనా నిజాలు ఉన్నాయా అన్నసందేహాలు మరికొందరిలో ఏర్పడ్డాయి.


మరికొందరైతే ఈ గాసిప్పుల వ్యవహారం వెనుక సమంత పిఆర్ టీమ్ హస్తం ఉందని కొందరు సందేహాలు వ్యక్తపరుస్తుంటే ఈవిషయాలను సమంత చాల తీవ్రంగా ఖండించింది. దీనితో ఈవిషయం పై చైతన్య నుంచి సమాధానాలు రాబట్టాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి సమయం ఎదురైనట్లు అనిపిస్తోంది.


వచ్చేనెలలో చైతన్య నటించిన ‘థాంక్యూ’ మూవీ రిలీజ్ కాబోతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చాల గట్టిగా ప్రమోట్ చేయాలని చైతన్య భావిస్తున్నాడు. దీనికోసం అనేక పత్రికలకు చైతూ ఇంటర్వ్యూలు ఇవ్వదడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఛాట్ చేయబోతున్నాడు. దీనితో ఎవరో ఒకరు చైతన్యను కార్నర్ చేస్తూ చైతూ శోభిత తో డేటింగ్ చేస్తున్నాడా అన్న ప్రశ్నలు అతడికి ఎదురయ్యే అవకాశం ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రశ్నలకు నాగ చైతన్య సమాధానాలు ఇస్తాడా లేదంటే ఇది అంతా మీడియా గాసిప్పు అని తప్పుకుంటాడా అన్న అంచనాలు కూడ ఉన్నాయి. ఆ క్లారిటీ వచ్చే వరకు ఇలాంటి గాసిప్పులు చైతూ పై అలా వస్తూనే ఉంటాయి..


 


మరింత సమాచారం తెలుసుకోండి: