కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన విక్రమ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . విక్రమ్ , శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన అపరిచితుడు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు .

అలా విక్రమ్ తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు . ఇది ఇలా ఉంటే విక్రమ్ తాజాగా కోబ్రా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ సినిమాలో కే జి ఎఫ్ బ్యూటీ శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను 11 ఆగస్టు 2022 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో కోబ్రా సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విక్రమ్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన కోబ్రా సినిమా తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను నటుడు ఉదయనిధి స్టాలిన్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఉదయనిధి స్టాలిన్  తన హోమ్ బ్యానర్ రెడ్ జెయింట్ మూవీస్ పై కోబ్రా మూవీ ని విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే కోబ్రా మూవీ లో ఇర్ఫాన్ పఠాన్, మృణాళిని రవి, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, కెఎస్ రవి కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మించారు. కోబ్రా మూవీ తో విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: