నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నటి అను ఇమ్మానియేల్(ANU EMMANUEL). తొలి సినిమాతోనే మంచి విజయం ను సంపాదించుకోవడం తోపాటు హీరోయిన్ గా తన అందంతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.


ఆ తర్వాత రాజ్ తరుణ్ తో నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా అంతగా సక్సెస్ అయితే కాలేదు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన అజ్ఞాతవాసి సినిమా లో ఒక హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో ఒక్కసారిగా తను ఎగిరి గంతేసింది. అయితే అమ్మడు ఆశలు దాని ద్వారా కూడా తీరక పోగా ఆ సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచి కెరియర్ పరంగా అనూ కు పెద్ద దెబ్బే తీసిందట.


ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ (ALLU ARJUN)తో నటించిన నా పేరు సూర్య సినిమా లో అవకాశం సంపాదించినప్పటికీ కూడా అనూ కి ఆ సినిమా ద్వారా కూడా సక్సెస్  అయితే మాత్రం దక్కలేదు. కొన్నాళ్లకు అక్కినేని వారి అబ్బాయి నాగచైతన్య నటించిన శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో డైరెక్టర్ మారుతి అను ఇమ్మానియేల్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. కానీ ఆ సినిమా కూడా ఘోరంగా పరాజయం పాలైందట.ఒక రకంగా ఆమె మొదట చేసిన సినిమా మజ్ను తప్పించి తెలుగులో ఆమెకు అంతగా సక్సెస్ రాలేదు. దాంతో ఈ అమ్మడు తమిళంలో కి వెళ్ళిందట.అయితే ఈ హీరోయిన్ సినీ కెరీర్ ఇంత పతనం అవ్వడానికి ఆమె మెగా హీరోల సరసన నటించిన రెండు సినిమాలే కారణమంటూ అప్పట్లో కొందరు సోషల్ మీడియా వేదికగా తెలిపారట.


అయితే అందుకు ఒక కారణం కూడా లేకపోలేదు. ఓ ఇంటర్వ్యూలో అను మాట్లాడుతూ.. తన లైఫ్ లో తెలియక కొన్ని మిస్టేక్స్ చేశానని, వాటి వల్లనే తనకు తెలుగులో పూర్తిగా అవకాశాలు కనుమరుగయ్యాయని చెప్పుకొచ్చిందట.వాస్తవానికి ఈ హీరోయిన్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో చేసిన సినిమాల పై ఎన్నో ఆశలు పెట్టుకుందని కానీ తన టైం బాగా లేకపోయినందువల్ల ఈ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయని తెలిపిందట.అయితే ఇదే విషయాన్ని పట్టుకొని కేవలం బన్నీ మరియు పవన్ కళ్యాణ్ వల్లనే ఆమె సినిమా కెరియర్ ఇలా అయిందని అనడం మంచిది కాదని, ఎందుకంటే ఏ సినిమా హిట్ అవుతుందో,ఏ సినిమా ఫ్లాఫ్ అవుతుందో అనేది ముందే తెలిస్తే అందరూ సక్సెస్ నే సాధిస్తారు కదా అని అంటున్నారట సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: