కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినా కిచ్చ సుదీప్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన సుదీప్సినిమా ద్వారా ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బాహుబలి,  సైరా నరసింహారెడ్డి లాంటి భారీ పామ్ ఇండియా తెలుగు సినిమాల్లో నటించి కిచ్చ సుదీప్ అలరించాడు. 

ఇది ఇలా ఉంటే తాజాగా సుదీప్ పాన్ ఇండియా సినిమా విక్రాంత్ రోనా మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు అభినయ్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనుప్ బండారి దర్శకత్వం వహించగా , కిచ్చా క్రియేషన్స్, షాలిని ఆర్ట్స్, ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను జూలై 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా కన్నడ , తెలుగు , మలయాళ , హిందీ , తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా,  ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ నుండి సెకండ్ లిరికల్ సాంగ్ ను జూలై 2 వ తేదీన సాయంత్రం 5 గంటల 02 నిమిషాలకు కన్నడ భాషలో విడుదల చేయనున్నారు. అలాగే జూలై 3 వ తేదీన సాయంత్రం 5 గంటల 02 నిమిషాలకు మలయాళం భాషలో విడుదల చేయనున్నారు. జూలై 4 వ తేదీన సాయంత్రం 5 గంటల 02 నిమిషాలకు తెలుగు భాషలో విడుదల చేయనున్నారు. జూలై 5 వ తేదీన సాయంత్రం 5 గంటల 02 నిమిషాలకు హిందీ భాషలో విడుదల చేయనున్నారు. జూలై 6 వ తేదీన సాయంత్రం 5 గంటల 02 నిమిషాలకు తమిళ్ భాషలో విడుదల చేయనున్నారు. ఈ ప్రకటనను తాజాగా చిత్రబృందం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: