ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈ నవ మన్మధుడు వందవ సినిమా గురించి ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కొన్నాళ్ళ క్రితమే నాగ్ 100 వ సినిమా గురించి ప్రస్తావన రాగా కొన్ని సినిమాల్లో నేను గెస్ట్ రోల్స్ చేశాను అవి తీసేస్తే...రౌండ్ ఫిగర్ కి ఇంకా టైం ఉందని చెప్పుకొచ్చారు నాగ్. అయితే ఇపుడు చూడబోతే ఆ సమయం రానే వచ్చింది అని అనిపిస్తోంది. అయితే తాజాగా నాగార్జున వందవ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం నాగ్ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో "ది ఘోస్ట్" అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది నాగ్ కి 99వ సినిమా, ఆ తరవాత రాబోయే 100 సినిమా గురించి అంతటా ఉత్కంఠ నెలకొంది.
ప్రతి హీరో కెరియర్ లో 25,50,100,150 వ చిత్రాలు ఇలా చాలా కీలకం అవుతాయి. అందుకనే హీరోలు ఈ నంబర్ల సినిమాల విషయంలో చాలా చాలా స్పెషల్ గా ఫోకస్ చేస్తుంటారు. అవి గుర్తుండి పోయే చిత్రాలుగా నిలవాలని ట్రై చేస్తారు. కాగా ఇపుడు హీరో నాగ్ కూడా తన 100 వ సినిమా కోసం భారీ ప్రణాళికే వేసినట్లు తెలుస్తోంది. తన 100వ సినిమా కోసం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ని రంగం లోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. నాగ్ 100 వ చిత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారితో ఉంటుంది అంటూ ఈ మధ్య వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాఘవేంద్రరావు డైరెక్షన్ లో నాగార్జున అన్నమయ్య, శ్రీరామదాసు మరియు షిర్డీ సాయి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు చేయగా ఈ సినిమా కూడా మరో బ్లాక్ బస్టర్ అవుతుందన్న ఆలోచన తోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన సినిమాని కూడా రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేయాలని ఫిక్స్ అయ్యారట నాగార్జున...అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.