నందమూరి కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సుమారు రెండు దశాబ్దాలు అవుతున్నా ఇంకా సరైన హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆమధ్య వచ్చిన ‘పటాస్’ సూపర్ హిట్ కావడంతో కళ్యాణ్ రామ్ కు ఆశలు చిగురించినా కొద్దిరోజులలోనే ఆ ఆశలు అడియాసలుగా మారిపోయాయి. దీనితో మళ్ళీ వరసపెట్టి ఫ్లాపులు ఎదురౌతున్నాయి.



ఇలాంటి పరిస్థితులలో కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘బింబిసార’ మూవీ బడ్జెట్ గురించి వార్తలు బయటకు వచ్చినప్పుడు ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోయాయి. ఈమూవీ పై కళ్యాణ్ రామ్ అత్యంత భారీస్థాయిలో ఖర్చు పెడుతున్నాడు. దీనితో ఏధైర్యం చూసుకుని ఇలా వ్యవహరిస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ కూడ చేసారు.


అయితే లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ ట్రైలర్ ను చూసిన వారు ఈమూవీతో కళ్యాణ్ రామ్ ఊహించని హిట్ కొట్టబోతున్నాడా అంటూ అంచనాలకు వచ్చేస్తున్నారు. పునర్జన్మల కాన్సెప్ట్ తో రూపొందింపబడ్డ ఈమూవీ నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. నిధి వ్యవహారం ప్రపంచంపై ఆధిపత్యం సాధించడం లాంటి మసాలా అంశాలు భారీ గ్రాఫిక్స్ తో ముడిపడి ఉండటంతో ఈ ట్రైలర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ రామ్ చేసిన ద్విపాత్రాభినయం గెటప్స్ తో పాటు నందమూరి ఫ్యామిలీ హీరోలకు ఉండే బలమైన వాయస్ డైలాగులు విన్నవారికి ఈసినిమా ఊహించని హిట్ అవుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి.


దీనికితోడు కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటలు కూడ బాగా కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. మంచి సాంకేతిక విలువలు భారీ సెట్స్ ఈమూవీకి మరొక ప్లస్ పాయింట్ కాబోతున్నాయి. ఆగష్టు మొదటి వారంలో విడుదల కాబోతున్న ఈమూవీకి సంబంధించిన ప్రచారాన్ని కూడ భారీ ఎత్తున చేయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు. ఈసినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణ ను తన తమ్ముడు జూనియర్ ను ఒకే వేదిక పైకి తీసుకు రావాలి అన్న అతడి వ్యూహం సక్సస్ అయితే ఇక ఈమూవీకి ఎదురుండక పోవచ్చు..



మరింత సమాచారం తెలుసుకోండి: