ఒక దర్శకుడు సినిమాకు బ్లాక్ బష్టర్ హిట్ వచ్చింది అంటే వెంటనే టాప్ యంగ్ హీరోలు చాలమంది ఆదర్శకుడుని ఆకాశంలోకి ఎత్తేస్తూ అతడితో సినిమా చేయాలని ఉంది అంటూ ఓపెన్ గానే ఆఫర్ ఇస్తున్నారు. ఈలిస్టులో మహేష్ అల్లు అర్జున్ లు చాల ముందు వరసలో ఉంటారు. గతంలో ‘అర్జున్ రెడ్డి’ సూపర్ సక్సస్ అయిన తరువాత మహేష్ సందీప్ వంగాతో సినిమా చేస్తాడని ఆతరువాత ‘కేజీ ఎఫ్’ సూపర్ హిట్ అయిన తరువాత మహేష్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి.


దీనికి తగ్గట్టుగానే ఆ దర్శకులు మహేష్ ను కలవడమే కాకుండా అతడికి కొన్ని కథలు కూడ వినిపించారు అని అంటారు అయితే ఆదర్శకుల ప్రయత్నాలు ఏమీ సఫలం కాలేదు. మహేష్ ను అదేవిధంగా అల్లు అర్జున్ ను ఒక కథ విషయంలో ఒప్పించడం అంత సులువైన పనికాదు అన్నమాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ‘విక్రమ్’ మూవీతో సంచలనాలు సృష్టించిన లోకేష్ కనకరాజ్ తో ఒక మూవీని చేసే ఉద్దేశ్యం తనకు ఉంది అంటూ మహేష్ ఓపెన్ గా సోషల్ మీడియా ద్వారా చెప్పడం దానికి లోకేష్ కనకరాజ్ ఓకె చేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


వాస్తానికి మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ మూవీ పూర్తి అయిన తరువాత రాజమౌళితో మూవీ చేయవలసి ఉంది. ఆమూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో మరి ఎప్పుడు విడుదల అవుతుందో మహేష్ కు కూడ తెలియని పరిస్థితి. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే మహేష్ రాజమౌళిల మూవీ 2024లో విడుదల కావచ్చు కానీ రాజమౌళితో సినిమా అంటే ఏది అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు.


ఇలాంటి కన్ఫ్యూజన్ తన ఎదురుపెట్టుకుని మహేష్ లోకేష్ కనకరాజుకు ఇలాంటి ఓపెన్ ఆఫర్ ఎందుకు ఇచ్చాడు అన్నసందేహాలు చాలమందిలో ఉన్నాయి. గతంలో మహేష్ వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి అతడిని 2సంవత్సరాలు వెయిటింగ్ లో పెట్టాడు. అయితే అలాంటి వెయిటింగ్ మహేష్ పెట్టినా తమిళనాడులో టాప్ డైరెక్టర్ గా పేరు మారుమ్రోగి పోతున్న లోకేష్ కనకరాజ్ మహేష్ పెట్టే వెయిటింగ్ కు ఎందుకు సహకరిస్తాడు అన్నది సమాధానం లేని ప్రశ్న..
మరింత సమాచారం తెలుసుకోండి: