ఉప్పెన సినిమాతో మొదటిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈ ముద్దుగుమ్మ అవకాశాలు కూడా వచ్చేలా చేసింది. ఇక ఈమె డిమాండ్ ను బట్టి కూడా రెన్యూరేషన్ ఒక్కసారిగా పెంచుకుంటూ పోతోంది. కేవలం రెండవ సినిమాకే ఈమె దాదాపుగా కోటి రూపాయలకు పైగా రెమ్యూరేషన్ అడగడం గమనార్హం. ప్రస్తుతం ఇదే తరహాలో ఈ ముద్దుగుమ్మ దూసుకుపోతోంది.


ప్రస్తుతం అగ్ర హీరోలతో కూడా సినిమాలు చేయడానికి బాగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఇక ప్రస్తుతం హీరో రామ్ తో కలిసి ది వారియర్ సినిమా ప్రమోషన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నది. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమాని తమిళ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా కూడా యాక్షన్ సినిమా. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుంది అని చిత్ర బృందం ఎంత నమ్మకంతో ఉన్నది. ఇక కృతి శెట్టి కూడా ఒకవైపు తమిళంలోనే కాకుండా మరొకవైపు తెలుగులో కూడా బాగా ప్రమోషన్స్ చేస్తూ ఉన్నది.


ఇక రీసెంట్ గా రాంచరణ్ మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమైన హీరోలు అని తెలియజేసింది రాంచరణ్ చాలా సూపర్ క్యూట్ గా ఉంటాడు మహేష్ అయితే చాలా హ్యాండ్సమ్ గా ఉంటారని విషయాన్ని తెలియజేసింది. భవిష్యత్తులో ఆ హీరోలతో నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని తనలోని కోరికను బయటపెట్టింది. ప్రస్తుతం కృతి శెట్టి మరొక రెండు సినిమాలకు కూడా నటిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఒక అగ్ర హీరో సినిమాలో నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: