పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా నటించాలని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే పవన్ నటించే సినిమాల సంఖ్య చాల తక్కువ కాబట్టి అతడి పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం అందరికీ రాదు. ఇలాంటి పరిస్థితులలో ‘బిగ్ బాస్’ బ్యూటీ ఆషురెడ్డి చేసిన సాహసం పవన్ అభిమానులకు షాక్ ఇచ్చింది.  


ఈమె నటించిన సినిమాల సంఖ్య చాల తక్కువే అయినప్పటికీ సోషల్ మీడియాలో ఎదో ఒక సంచలనం చేస్తూ ఎప్పుడు వార్తలలో ఉండాలని ఈమె ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ప్రయత్నాలకు పవన్ కళ్యాణ్ పేరును కూడ వాడుకోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. పవన్ పేరును తన శరీరం పై ఉన్న ఒక ప్రవేట్ పార్ట్ లో అషురెడ్డి పచ్చబోట్టుగా వేయించుకుని దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ షేర్ చేసింది.


అయితే ఆషురెడ్డి చేసిన ఈ ప్రయత్నానికి పవన్ అభిమానుల నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ టాటూ ను తన శరీరం పై వేసుకోవడం ద్వారా తనకు విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది అన్న ఉద్దేశ్యంతో ఆషురెడ్డి ఇలాంటి చీప్ టెక్నిక్స్ అవలంభిస్తోంది అంటూ కొందరు పవన్ అభిమానులు ఆమె పై ఘాటైన సెటైర్లు వేస్తున్నారు. ఈ కామెంట్స్ ఎలా ఉన్నప్పటికీ ఆషురెడ్డికి మాత్రం తాను చేసిన ఈ ప్రయత్నంతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు వచ్చింది.


ఈ పరిస్థితులు ఇలా ఉంటే భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహ ఆవిష్కరణ సభకు ప్రధానమంత్రి మోడీ తో పాటు చిరంజీవి పాల్గొన్న సందర్భంలో ఇలాంటి ఫంక్షన్ కు భారతీయ జనతాపార్టీ పవన్ ను కాకుండా చిరంజీవిని ఎందుకు ఆహ్వానించింది అంటూ అభిమానులు ఆశ్చర్య పడుతున్నారు అన్న మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చిరంజీవి అడుగులు భారతీయ జనతాపార్టీ వైపు పడుతున్నాయా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..





మరింత సమాచారం తెలుసుకోండి: