టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సి అనే పదం తెరమీదికి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి గుర్తుకువచ్చేది సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఒకప్పుడు తన సినిమాలతో సెన్సేషన్ సృష్టించి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు తన సినిమాలతో కాంట్రవర్సీలు సృష్టిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అయితే వర్మ ఎన్ని కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయనకు అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది అని చెప్పాలి. ఆర్జివి లాగా ఒక్కరోజు బ్రతికితే చాలు అనుకునే అభిమానులు కూడా లేకపోతే లేదు నేటి రోజులలో.


 మనసులో ఏం ఉన్నా కూడా ముక్కుసూటిగా మాట్లాడుతూ ముఖం మీదే చెబుతూ ఉంటాడు రాంగోపాల్ వర్మ. తన మాటలకు ముందున్నవారు ఏమనుకుంటారు అన్న విషయాన్ని కూడా అస్సలు ఆలోచించడు అని చెప్పాలి. అందుకే వర్మ ఏం చేసినా సెన్సేషనల్ గానే మారిపోతూ ఉంటుంది. ఇకపోతే ఇటీవలే యాంకర్ శ్యామల పై రామ్ గోపాల్ వర్మ సీరియస్ అయ్యాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. వార్తలు వినిపించడం కాదు ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో లేడీ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా బాలేకర్ నటించగా.. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో సినిమా రూపొందించారు.


 ఖమ్మం లో ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా ఆర్జీవి స్టేజి మీదికి వచ్చి మాట్లాడారు. ఇక తన స్పీచ్ పూర్తి చేసి  వెళ్లిపోతున్న సమయంలో యాంకర్ శ్యామల ఒక చిన్న రిక్వెస్ట్ అంటూ చెప్పింది. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఇంగ్లీష్ సినిమాలు పేర్లు  తెలుగులో అనువదించాము. తెలుగులో పేరు చెబుతాను మీరు ఇంగ్లీషులో పేర్లు చెప్పండి అడుగుతుంది. ముందు సరే అంటూ చెబుతాడు ఆర్జీవి. ఇక ఆ తర్వాత శ్యామల అడిగిన ప్రశ్నలకు చిరాకు పడతాడు. నేను చాలా ఎమోషనల్ గా ఉన్నా ఇది చాలా సీరియస్ సినిమా అంటూ వెళ్ళిపోతాడు. శ్యామల కూడా క్షమాపణలు చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv