పవన్ కళ్యాణ్ తో సినిమా తీసే అవకాశం చాల తక్కువమంది దర్శకులకు మాత్రమే వస్తుంది. రచయితగా దర్శకుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వేణు శ్రీరామ్ తన రెండవ సినిమాకే పవన్ తో దర్శకత్వం వహించిన అవకాశం వచ్చినందుకు సంబరపడిపోయాడు. అయితే పవన్ తో తీసిన ‘వకీల్ సాబ్’ సక్సస్ అయినప్పటికీ ఈ దర్శకుడు వైపు ఏటాప్ యంగ్ హీరో చూడలేదు.


వాస్తవానికి వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ మూవీ తీయాలని ఎంతగానో ప్రయత్నించాడు. ఈ మూవీ కథకు అల్లు అర్జున్ ఓకె చెప్పినప్పటికీ ఆతఃరువాత ‘పుష్ప’ ప్రాజెక్ట్ లో చిక్కుకోవడంతో ‘ఐకాన్’ అటకెక్కింది. ఇలాంటి పరిస్థితుల మధ్య వేణు శ్రీరామ్ వైపు ఎవరు చూడకపోవడంతో అతడు చాలకాలంగా ఖాళీగా ఉండవలసి వస్తోంది.


ఇప్పుడు ఈ దర్శకుడుకి అఖిల్ తో తీసే అవకాశం లభించడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అఖిల్ సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ మూవీ నిర్మాణంలో ఉంది. వాస్తవానికి ఈ మూవీ ఈనెలలో విడుదల కావలసి ఉన్నప్పటికీ ఈ మూవీలో కొన్ని సీన్స్ రీ షూట్ చేయవలసి రావడంతో ఈమూవీ విడుదల వాయిదా వేసారు. అయితే ఈమూవీ విడుదల కాకుండానే అఖిల్ మరొక సినిమాకు లైన్ క్లియర్ చేసాడు.


వేణు శ్రీరామ్ వ్రాసిన ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ కథకు అఖిల్ ఓకె చేయడంతో ఈమూవీకి పవన్ కళ్యాణ్ సినిమాలలో సూపర్ హిట్ గా రికార్డులు క్రియేట్ చేసిన ‘తమ్ముడు’ టైటిల్’ ను మళ్ళీ అఖిల్ సినిమాకు టైటిల్ గా పెట్టినట్లు తెలుస్తోంది. ఈమూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. దీనితో అల్లు అర్జున్ తో సినిమా తీయాలని ప్రయత్నించిన వేణు శ్రీరామ్ అఖిల్ తో సరిపెట్టుకోవలసి వచ్చిందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘ఏజెంట్’ సినిమా విజయం పై ఇప్పటికే అఖిల్ కు కొన్ని సందేహాలు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో అక్కినేని ఫ్యామిలీకి కలిసివచ్చే లవ్ స్టోరీ సెంటిమెంట్ ను తాను కూడ ఎంచుకున్నట్లు అనిపిస్తోంది..




మరింత సమాచారం తెలుసుకోండి: