ఇక సినిమా టికెట్ రేట్లు అమాంతం పెంచేయడంతో జనాలు ఎంతగా ఇబ్బంది పడ్డారో అందరికి తెలిసిందే. చాలా దారుణంగా 150 రూపాయల టికెట్ ను 300 వరకు కూడా పెంచేశారు. ఇంకా అలాగే టాక్స్ లతో కలిపి రూ.350 వరకు అయ్యేది.అంటే సగానికి పైగా టికెట్స్ రేట్లని పెంచేయడం జరిగింది.దీంతో ఇక ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం పూర్తిగా తగ్గించేశారు. ఎలాగో సినిమా ఓటీటీలో వస్తుంది కదా అని జనాలు పూర్తిగా లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అందుకే ఈ మధ్యకాలంలో విడుదలవుతోన్న సినిమాలకు సరైన ఓపెనింగ్స్ అనేవి రావడం లేదు. సినిమాకి హిట్ టాక్ వచ్చినా కానీ థియేటర్ కు మళ్ళీ వెళ్లి చూడడానికి జనాలు ఇష్టపడడం లేదు.ఇక పెరిగిన రేట్లతో సొమ్ము చేసుకోవాలని చూసిన నిర్మాతలకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. దెబ్బకు చేసేదేంలేక టికెట్ రేట్లు తగ్గించడం మొదలుపెట్టారు. 'ఎఫ్3' సినిమాతో మొదలైన టికెట్ రేట్ల తగ్గింపు ఇప్పుడు 'థాంక్యూ' సినిమా వరకు కూడా వచ్చింది. సింగిల్ థియేటర్ రేటు వచ్చేసి రూ.100 ప్లస్ జీఎస్టీ అంటూ ప్రకటించారు.


మల్టీప్లెక్స్ లో ఇదివరకు మాదిరి టికెట్ రేటు వచ్చేసి రూ.150గా అమ్మబోతున్నారు.ఇక ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం ఇలా టికెట్ రేట్లు తగ్గింపు మార్గం చూసుకుంటున్నారు టాలీవుడ్ నిర్మాతలు. అలాగే మిగిలిన సినిమాలు కూడా ఇదే రూట్ ఫాలో అవ్వాల్సి వస్తుందేమో. లేదంటే కలెక్షన్స్ పరంగా దెబ్బ పడడం ఖాయం. టికెట్ రేట్లు పెంచడం కోసం శ్రమించిన నిర్మాతల్లో ఖచ్చితంగా దిల్ రాజు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయనే లాభాల కోసం తన సినిమాలకు రేట్లు తగ్గించి అమ్ముతున్నారు. ఈ స్టెప్ తో 'థాంక్యూ' సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయేమో అనేది ఇక చూడాలి. ఈ సినిమాపై నాగ చైతన్య చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నాగ చైతన్య భావిస్తున్నాడు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: