బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో ఒకరైన రన్బీర్ కపూర్ గురించి కొత్తగా సినిమా ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే రన్బీర్ కపూర్ ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు . ఇది ఇలా ఉంటే ఈ హీరో తాను నటించిన హిందీ సినిమాల ద్వారా తెలుగు లోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు .

తాజాగా రన్బీర్ కపూర్ 'షంషేర్' అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నారు . ఇప్పటికే షంషేర్ మూవీ తెలుగు ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేయగా , ఈ మూవీ తెలుగు ట్రైలర్ కు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది . షంషేర్ మూవీ ని జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నారు . ఇది ఇలా ఉంటే తాజాగా రన్బీర్ కపూర్ , ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్ లను చేశాడు . అసలు విషయం లోకి వెళితే ...  రన్బీర్ కపూర్ తాజాగా తెలుగు మీడియా తో ఇంటరాక్షన్‌ అయ్యారు . 

ఇందులో భాగంగా రన్బీర్ కపూర్ కు మీకు ఇష్టమైన పాన్ ఇండియా స్టార్ ఎవరు అనే ప్రశ్న ఎదురైంది . ఈ ప్రశ్నకు రన్బీర్ కపూర్ సమాధానం ఇస్తూ... ప్రభాస్ నాకు నచ్చిన పాన్ ఇండియా స్టార్. కేవలం ఒక్క నటన విషయంలో మాత్రమే  కాదు , ఆయన వ్యక్తిత్వం పరంగా కూడా నాకు బాగా నచ్చిన వ్యక్తి.  ప్రభాస్ ను పెద్ద స్క్రీన్‌  పై చూడటం అంటే నాకు చాలా ఇష్టం అని తాజాగా రన్బీర్ కపూర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: