బాలీవుడ్ లో అత్యధికంగా ఆదాయం పన్ను చెల్లిస్తున్న హీరోల్లో ఖచ్చితంగా అక్షయ్ కుమార్ ఒకరన్న విషయం తెలిసిందే. అయితే, మరోసారి దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పన్ను చెల్లించిన వారిలో అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో నిలిచినట్టు ఐటీ విభాగం ఇటీవల తెలిపింది. ఇక అందుకు గానూ ఆయనకు గౌరవంతో కూడిన ఓ హానరరీ సర్టిఫికెట్ ని కూడా ప్రధానం చేసింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ గా మారింది. ఇంకా నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.ఇక అక్షయ్ ని ద్వేషించే వారు.. ఒక్కసారి ఆయన నిజాయతీని కూడా గమనించాలని సూచిస్తున్నారు.ఇక బాలీవుడ్‌ లో భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్.. పలు ప్రముఖ కంపెనీలకు కూడా ఆయన ప్రచార కర్తగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదాయ పన్ను శాఖ 'సమ్మాన్ పత్ర' అవార్డు అందుకోవడం అనేది చెప్పుకోదగిన విషయం.


గత ఐదేళ్లుగా కూడా ఆయన బాలీవుడ్ నుంచి అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా కొనసాగుతూ ఉన్నారు.అయితే ఆయన ఆదాయం ఎంత ఇంకా ఎంత పన్ను చెల్లించారనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.ఇక ఇదిలా ఉండగా చెన్నైలో కూడా ఇన్‌కమ్ టాక్స్ డే ఘనంగా నిర్వహించారు అధికారులు.తెలంగాణ గవర్నర్ అయిన తమిళి సై ముఖ్యఅతిథిగా హాజరైన కార్యక్రమంలో అత్యధిక టాక్స్ చెల్లించిన వారికి అవార్డులు కూడా అందించారు. అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఉండటంతో ఆయన తరపున కూతురు ఐశ్వర్య ఈ పురస్కారాన్ని స్వీకరించింది.అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వార్ చేస్తున్నారు రజినీ ఫ్యాన్స్. మా సూపర్ స్టార్ రజినికాంత్ ఎక్కువ టాక్స్ పే చేశారు #HighestTaxPayerRajini అనే హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. రజిని ఒక్కో సినిమాకి 100 కోట్లు పారితోషికం తీసకుంటే అక్షయ్ 80-100 కోట్లు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: