హీరోయిన్ రష్మిక బాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగు ప్రాజెక్టులు పైగా ఉన్నాయి. గుడ్ బై చిత్రంతో బ్యూటీ మొదటిసారిగా బాలివుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది ఆట తర్వాత మిషన్ మజ్ను, యానియల్ చిత్రాలతో త్వరలో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వీటిలో రష్మిక పాత్ర ఎలా ఉండబోతోంది అన్న విషయం ఇంకా తెలుపలేదు చిత్ర బృందం.. అయితే ఇప్పుడు సైలెంట్ గా స్ర్కూడిలా లో హంక్ టైగర్ ష్రాఫ్ తో ఘాటైన రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


శశాంక్ డైరెక్షన్లో స్ర్కూడిలా సినిమాని తెరకెక్కించబోతున్నారు ఇందులో టైగర్ జిమ్ ట్రైనింగ్  పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలలో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం అన్నట్టుగా తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో యాక్షన్ తో పాటు రొమాన్స్ కి కూడా అంతే ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టైగర్ రష్మిక మధ్య ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. కొన్ని సన్నివేశాలలో డిమాండ్ చేస్తే రష్మిక టైగర్ తో నటించడానికి ఎలాంటి అడ్డంకు కూడా చెప్పలేదని టాక్ వినిపిస్తున్నది.


ఇక వీరిద్దరి మధ్య సన్నివేశాలు వాస్తవికంగానే ఉండబోతున్నట్లు సమాచారం ఇదే కనుక నిజమైతే రష్మిక హద్దులు చెరిపేసింది అని చెప్పవచ్చు.. ఇప్పటివరకు ఇలాంటి అవకాశాన్ని ఎప్పుడు ఇవ్వలేదు రష్మిక. తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది గాని గీతాగోవిందం సినిమాలో విజయ్తో మాత్రమే కేవలం లిప్ లాక్ సన్నివేశాలలో నటించింది. ఆ తరువాత డియర్ కామ్రేడ్ రెండు సినిమాల్లో కూడా అలాంటి సన్నివేశాలలోనే నటించింది. ఇక తర్వాత పుష్ప చిత్రంలో కొన్ని ఇంటిమేట్ సీన్లలో నటించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో రొమాంటిక్ సన్నివేశాలు అంటే ఎలా ఉంటాయో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి సినిమాలో రష్మిక ఎలా ఉండబోతుందో అంటే అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: