ఇక ర్యాన్ గోస్లింగ్ కథానాయకుడిగా రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన సినిమా 'ది గ్రే మ్యాన్'.'కెప్టెన్ అమెరికా' ఫేమ్ క్రిస్ ఇవాన్స్ ఈ సినిమాలో విలన్ రోల్ చేశారు. ఇంకా అనా డి ఆర్మాస్ కీలక పాత్ర పోషించారు.ఇక 'ది గ్రే మ్యాన్' మూవీ కొన్ని రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదల అయ్యింది. యాక్షన్ ప్రియులను ఇది బాగా ఆకట్టుకుంది. సుమారు 92 దేశాల్లో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కాగా... చాలా అద్భుతమైన స్పందన లభించిందని చిత్ర బృందం పేర్కొంది. ఇప్పుడీ సినిమా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ ని అందించింది.ఇక 'ది గ్రే మ్యాన్'కు సీక్వెల్ తీస్తున్నట్లు లేటెస్టుగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రూసో బ్రదర్స్ మాట్లాడుతూ ''ది గ్రే మ్యాన్'కి ప్రేక్షకుల నుంచి చాలా అద్భుత స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల అంచనాలను అందుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆసక్తికరమైన పాత్రలు ఉన్న ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీలా ఇంకా కొత్త గూఢచారి ప్రపంచంలా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్న ఆలోచన మాకు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌తో పాటు మేము త్వరలో ప్రకటించబోయే మరో చిత్రాన్ని కూడా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం'' అని చెప్పారు.


ఈ సినిమాలో గ్లోబల్ యాక్టర్ ధనుష్ కూడా ఓ పాత్రలో కనిపించారు.అయితే అది కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే. ధనుష్ తో రెండు సీన్స్ మాత్రమే తీశారు. ఆ రెండు కూడా మంచి యాక్షన్ ఫైట్ సీన్స్ కావడం విశేషం. ఆ సీన్స్ లో ధనుష్ యాక్టింగ్ కి ఇంకా ఆయన ఫైట్స్ కి ఆడియన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఆ రెండు సీన్స్ ఈ సినిమాకి హైలెట్ అని చెప్పాలి. చాలా అద్భుతంగా వున్నాయి. అయితే ఈ సినిమా సీక్వెల్ లో ధనుష్ యాక్ట్ చేస్తాడా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే ఈ విషయంపై ధనుష్ స్పందించాడు. ఈ సినిమా సీక్వెల్ కి రుస్సో బ్రదర్స్ నుంచి తనకు పిలుపు రాలేదని క్లారిటీ ఇచ్చాడు.సో ధనుష్సినిమా సీక్వెల్ లో నటించట్లేదని అర్ధమవుతుంది.ఇక ఇదిలా ఉండగా ధనుష్ బర్త్ డే సందర్బంగా ఆయన తెలుగు తమిళ్ లో చేస్తున్న సార్ సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: