‘అఖండ’ ఊహించన దానికంటే సూపర్ హిట్ అయినప్పటికీ బోయపాటి శ్రీనుకి కాలం కలిసి రావడం లేదు. ‘అఖండ’ సూపర్ హిట్ తరువాత టాప్ హీరోల నుండి తనకు పిలుపు వస్తుందని భావించాడు. అయితే జరిగింది వేరు టాప్ యంగ్ హీరోలు అంతా బిజీగా ఉండటంతో పాటు బోయపాటి తీసే ఊర మాస్ సినిమాలు చేసే విషయంలో పెద్దగా ఆశక్తి కనపరచలేదు.  


దీనితో బోయపాటి శ్రీను మీడియం రేంజ్ హీరో రామ్ తో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా మార్చాలని బోయపాటి ప్లాన్ వేసుకున్నాడు. అయితే ఇప్పుడు అతడి ప్లాన్ అంతా బ్రేక్ అయినట్లు తెలుస్తోంది. దీనికి కారణం రామ్ నటించిన ‘ది వారియర్’ మూవీ ఘోరంగా ఫ్లాప్ కావడం.


వాస్తవానికి రామ్ తన మార్కెట్ ను పెంచుకోవాలని ‘ది వారియర్’ మూవీని ఒకేసారి విడుదల చేసాడు. అయితే ఈ రెండు భాషలలో కూడ ఈ మూవీ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో రామ్ మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితులలో బోయపాటి రామ్ తో తీయబోతున్న మూవీ పై అత్యంత భారీ బడ్జెట్ ఖర్చుపెడితే ఆ మూవీ మార్కెట్ అయ్యే పరిస్తితిలేదు. ఇప్పటికే రామ్ నటించిన ‘రెడ్’ ‘దివారియర్’ మూవీలు ఫ్లాప్ అయ్యాయి.


ఇప్పుడు రామ్ సినిమాకు బయ్యర్లు కూడ దొరకడం కష్టం. అందువల్ల బోయపాటి రామ్ తో తీయబోతున్న మూవీని చాల తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసి నష్టాలు రాకుండా జాగ్రత్తపడాలని ఈ మూవీ స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. దీనికితోడు ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలో కలక్షన్స్ అంతంతమాత్రంగా ఉండటంతో ఈ మూవీ పై భారీగా బోయపాటి శ్రీను స్టైల్ లో ఖర్చుపెట్టి నష్టాలు కొని తెచ్చుకునేకన్నా ఈ మూవీని తక్కువ బడ్జెట్ తో పూర్తి చేసి నష్టపోకుండా జాగ్రత్త పడాలని బోయపాటి ఆలోచన..




మరింత సమాచారం తెలుసుకోండి: