టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా నటించిన లేటెస్ట్ మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ.ఇక ఎన్నో మంచి అంచనాల నడుమ జూలై 29న విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న రేంజ్‌లో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌ను రాబట్టలేకపోయింది. దీంతో ఈ సినిమా మొత్తం మీద 3 కోట్ల రేంజ్‌లో అయినా కలెక్షన్స్‌ను వసూలు చేస్తుందని భావించినా కూడా అసలు అలా జరగలేదు.ఇక మొత్తం మీద ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 2.82 కోట్ల షేర్‌ను వసూలు చేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమాకు 3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ అనుకుంటే మొత్తం మీద సినిమా అంచనాలను అందుకోలేక పోయి మొదటి రోజే దారుణంగా చతికిలపడింది.


ఇక ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్‌ను చూస్తే.. నైజాం: 85 లక్షలు, సీడెడ్: 52లక్షలు, ఉత్తరాంధ్ర : 45 లక్షలు, ఈస్ట్ : 31 లక్షలు, వెస్ట్: 16 లక్షలు, గుంటూరు: 24లక్షలు, కృష్ణ: 17 లక్షలు, నెల్లూరు : 12 లక్షలు. ఏపీ తెలంగాణలో 2.82 కోట్ల షేర్ (4.75 కోట్ల గ్రాస్)ను ఈ సినిమా వసూలు చేసింది.ఇంకా కర్నాకటతో రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.25 కోట్లు, ఓవర్సీస్ : 35 లక్షలు. వరల్డ్ వైడ్ మొత్తంగా 3.42 కోట్లు (5.9 కోట్లు~ గ్రాస్). ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మొత్తం 17.20 కోట్ల రేంజ్‌లో జరుగగా.. 18 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఈ సినిమా ఇంకా 14.58 కోట్ల రేంజ్‌లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.కానీ అది ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమాకి టాలీవుడ్ కి మరో గట్టి ఫ్లాప్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: