ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకి ఎలాంటి క్రేజ్ దక్కిందో మనకి తెలిసిందే.అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం మంచి హిట్ అయిన కూడా ఎన్టీఆర్‌కి అయితే పెద్దగా పేరు రాలేదు. ఇదిలావుంటే ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇకపోతే ఈ సినిమా రామ్ చరణ్ కి చాలా ప్లస్ అయింది. 

కాగా ఈ క్రమంలో ఎన్టీఆర్ సోలో సినిమాతో ఎప్పుడు అలరిస్తాడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదిలావుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్' - క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ కు సంబంధించి ఒక అప్ డేట్ తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. కాగా ఆగస్టు 26 నుంచి ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్ కోసం భారీ సెట్ ను నిర్మిస్తున్నారు.ఇక  క్లైమాక్స్ లో వచ్చే ఈ సెట్ బ్లాస్ట్ సీన్ లో ఎన్టీఆర్ యాక్షన్ అదరిపోతుందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో తన పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నారు. ఇదిలావుంటే ఈ సినిమా కోసం 8-9 కిలోల బరువు తగ్గనున్నాడు తారక్.అయితే   ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'జనతా గ్యారేజ్' పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.అయితే  అన్నట్టు 2023 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నట్లు తెలుస్తోంది.కొరటాల శివ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు దర్శకులతో సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుంది. అంతె కాక బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతున్నాకూడా దానిపై క్లారిటీ అయితే రావడం లేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: