యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈస్మార్ట్ శంకర్ , రెడ్ వంటి రెండు వరుస విజయాల తర్వాత తాజాగా రామ్ పోతినేని 'ది వారియర్' అనే పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కి తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వం వహించగా , యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఈ మూవీ లో కథానాయికగా నటించింది.

మంచి అంచనాల నడుమ జులై 14 వ తేదీన ది వారియర్ మూవీ తెలుగు మరియు తమిళ భాషలలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. తమిళ దర్శకుడు లింగుసామి ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి తమిళ ఇండస్ట్రీ లో కూడా అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళ నాట ది వారియర్ మూవీ కి 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.  

అలా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను తమిళ నాట జరుపుకున్న ది వారియర్ మూవీ  టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి తమిళ వర్షన్  1.5 కోట్ల షేర్ , 3.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో చివరగా ది వారియర్ మూవీ తమిళ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 2.5 కోట్ల మేర నష్టాలను మిగిల్చింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ,  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన పాటలకు , సంగీతానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: